Advertisement

  • ‘మైండ్ బ్లాక్’ పాటకు స్టెప్పులేసిన సన్‌రైజర్స్ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్

‘మైండ్ బ్లాక్’ పాటకు స్టెప్పులేసిన సన్‌రైజర్స్ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్

By: chandrasekar Mon, 10 Aug 2020 2:26 PM

‘మైండ్ బ్లాక్’ పాటకు స్టెప్పులేసిన సన్‌రైజర్స్ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్


ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మాన్ మరియు ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ద్వారా తెలుగు క్రికెట్ అభిమానులకు దగ్గరైన క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల పాటలకు తన భార్య క్యాండైస్‌తో కలిసి స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్ బ్లాక్’ పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మహేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబును ‘లెజెండ్’ అని పేర్కొన్నారు. తనకు తెలుగు పాటలపైనా వున్న మక్కువను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి తెలుగు ప్రజలకు దగ్గరవుతున్న డేవిడ్ వార్నర్ మంచి గుర్తింపునే పొందారు.

ఇంతకు ముందు బన్నీ పాటలకు స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్ ఇప్పుడేమో మహేష్ బాబు సినిమాలో స్టెప్పులేసి అదరగొట్టారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ‘మైండ్ బ్లాక్’ పాటలో డేవిడ్ వార్నర్ మరియు క్యాండైస్ కలిసి మహేష్ బాబు, రష్మిక మందన వేసినట్టే స్టెప్పులేశారు. వార్నర్ దంపతులు డ్యాన్స్ చేస్తుంటే వెనుకే చిన్నారి కూతుళ్లు కూడా మైండ్ బ్లాక్ స్టెప్‌తో అదరగొట్టారు. ఈ వీడియో విషెస్ మహేష్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 7.5 లక్షల లైకులు ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు వచ్చాయి. డ్యాన్స్ అదిరిపోయింది అంటూ మహేష్ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఈ డాన్స్ నెటిజెన్ల మధ్య మంచి వుతేజాన్ని కలిగించింది. ఈ మధ్య తెలుగు సినిమాలోని పాటలకు స్టెప్పులేసి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపును పొందుతున్నాడు డేవిడ్ వార్నర్.

Tags :

Advertisement