Advertisement

  • ఈ సిరీస్ లో అతడి బ్యాటింగ్ చూడాలని ఉంది ...సునీల్ గవాస్కర్

ఈ సిరీస్ లో అతడి బ్యాటింగ్ చూడాలని ఉంది ...సునీల్ గవాస్కర్

By: Sankar Tue, 15 Dec 2020 12:12 PM

ఈ సిరీస్ లో అతడి బ్యాటింగ్ చూడాలని ఉంది ...సునీల్ గవాస్కర్


కరోనా కారణంగా చాలాకాలంగా ఆంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న టీమిండియా ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది ..అందులో భాగంగా టి ట్వంటీ , వన్ డే సిరీస్ ముగిసాయి ..ఇక టెస్ట్ సిరీస్ మిగిలింది..ఇండియా ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ అంటే ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది...ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డలో గట్టిపోటీనిచ్చే అతి కొద్దీ జట్లలో టీమిండియా ఒకటి ...గత పర్యటనలో టీమిండియా ఏకంగా సిరీస్ గెలుచుకుంది...మరి ఈ సారి కూడా అది రిపీట్ అయితుందా లేదో చూడాలి ...

అయితే గత ఏడాది పర్యటనలో భారత టెస్ట్ స్పెషలిస్ట్ చేతేశ్వర్ పుజారా భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పుజారా నాలుగు టెస్టుల్లో 1258 ఎదుర్కొని 521 పరుగులు చేసాడు. అయితే ఈ సిరీస్ ఆరంభానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ పూజారా పై ప్రశంసలు కురిపించాడు. అలాగే ఈ సిరీస్ లో పుజారా బ్యాటింగ్ చూడాలని ఎదురు చూస్తున్నానని చెప్పాడు.

గవాస్కర్ మాట్లాడుతూ... పుజారా కరోనా విరామం తర్వాత క్రికెట్ ఆడిన ఆడకపోయినా అతను మానసికంగా చాలా బలంగా ఉన్నాడు. అతను త్వరగా ఔట్ అవుతాడని నేను అనుకోను... అతను బ్యాటింగ్ చేయడానికి, ఎక్కువ సమయంక్రీజులో ఉండటం ఇష్టపడతాడు అని చెప్పిన గవాస్కర్ గత రెండు సంవత్సరాలలో పుజారా తన స్ట్రోక్స్ మరియు షాట్స్ ఆడే విధానాన్ని మెరుగుపరుచుకున్నాడు అని తెలిపాడు.

Tags :
|
|

Advertisement