Advertisement

  • క్రిస్ గేల్ పై ఇప్పటికైనా దృష్టి సారించాలన్న సునీల్ గవాస్కర్

క్రిస్ గేల్ పై ఇప్పటికైనా దృష్టి సారించాలన్న సునీల్ గవాస్కర్

By: chandrasekar Fri, 09 Oct 2020 5:44 PM

క్రిస్ గేల్ పై  ఇప్పటికైనా దృష్టి సారించాలన్న సునీల్ గవాస్కర్


పంజాబ్ జట్టులో డాషింగ్ బ్యాట్స్ మాన్ క్రిస్ గేల్ పై ఇప్పటికైనా దృష్టి సారించాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ జట్టు క్రిస్‌గేల్‌‌ను మరోమారు పక్కనపెట్టడంపై బ్యాటింగ్ గ్రేట్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. సమయం మించిపోకముందే గేల్‌ను బరిలోకి దింపాలని సూచించాడు. ఆ తర్వాత జట్టులోకి తీసుకున్నా ఫలితం ఉండదని తేల్చి చెప్పాడు. విధ్వంసకర ఆటగాడైన గేల్‌ను వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ పంజాబ్ జట్టు పక్కనపెట్టింది. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో టాప్-10లో ఉన్న గేల్ ఆరు శతకాలు నమోదు చేశాడు. అయినప్పటికీ జట్టులో చోటు కోసం ఆరు మ్యాచ్‌లుగా నిరీక్షిస్తున్నాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ సేన పరిస్థితి కడు దయనీయంగా ఉంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

ఇంతకు ముందు జరిగిన ఐపీల్ లో 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గేల్ చివరిసారి సెంచరీ నమోదు చేశాడు. గేల్ గత 522 రోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. చివరిసారి గతేడాది మేలో పంజాబ్ తరపున ఆడాడు. గేల్ పై ఇప్పటికైనా దృష్టి సారించాలి. మిడిలార్డర్‌లో అతడు మంచి లెఫ్ట్ హ్యాండర్ కాగలడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ సరిగా ఆడలేకపోతున్నాడు. గేల్‌ను బరిలోకి దించేందుకు ఇదే సరైన సమయం. ఆ తర్వాత దించినా అప్పటికే సమయం మించిపోతుంది. తర్వాతి రెండు మ్యాచుల్లో తప్పనిసరిగా గేల్‌ను ఆడించాల్సిందే అని గవాస్కర్ పేర్కొన్నాడు. గేల్ మూడు, నాలుగు స్థానాల్లో అయినా, ఓపెనర్‌గా వచ్చినా పరవాలేదని, అప్పుడు మయాంక్ అగర్వాల్ మూడో స్థానంలో వస్తాడని గవాస్కర్ అన్నాడు. కూర్పు ఏదైనా పరవాలేదన్నాడు. కానీ, క్రిస్ గేల్‌ను మాత్రం చాలా చాలా తొందరగా ఉపయోగించుకోవాలని, లేకుంటే సమయం మించిపోయినట్టేనని గవాస్కర్ వివరించాడు. చాలా మంది అభిమానులు కూడా క్రిస్ గేల్ ఆట కోసం ఎదురుచూస్తున్నారు.


Tags :

Advertisement