Advertisement

  • టీమిండియా ఆటగాళ్లను తప్పుపట్టడానికి లేదు ..సునీల్ గవాస్కర్

టీమిండియా ఆటగాళ్లను తప్పుపట్టడానికి లేదు ..సునీల్ గవాస్కర్

By: Sankar Mon, 21 Dec 2020 10:32 AM

టీమిండియా ఆటగాళ్లను తప్పుపట్టడానికి లేదు ..సునీల్ గవాస్కర్


ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నమోదు చేసిన చెత్త రికార్డుపై భారత జట్టు మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ స్పందించాడు. జట్టు వైఫల్యానికి బ్యాట్స్‌మెన్‌ను తప్పుపట్టడం సరికాదన్నాడు.

ఆసీస్‌ పేస్‌ బౌలర్లు అద్భుతంగా రాణించారంటూ ప్రశంసలు కురిపించిన గావస్కర్‌.. వారి ధాటికి భారత్‌ స్థానంలో ఏ జట్టు ఉన్నా సరే 80-90 పరుగులకు మించి స్కోరు నమోదు చేయలేకపోయేదని అభిప్రాయపడ్డాడు. కాగా తొలి టెస్టు మూడోరోజు ఆటలో భాగంగా కేవలం 36 పరుగులకే భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగించిన సంగతి తెలిసిందే.

ఆసీస్‌ బౌలర్లు హజిల్‌వుడ్‌(5 వికెట్లు), కమిన్స్‌ (4 వికెట్లు) ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఒక్కరు కూడా సింగిల్‌ డిజిట్‌ స్కోరు దాటలేక చేతులెత్తేశారు. మయాంక్‌ అగర్వాల్‌ 9 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు...ఇక ఇన్నింగ్స్‌లో ఒక్క ఆటగాడు కూడా డబుల్‌ డిజిట్‌ దాటకపోవడం 96 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో కోహ్లి సేనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి...

Tags :

Advertisement