Advertisement

  • నేను ఏం తప్పుగా మాట్లాడాను చూయించండి...అనుష్క వ్యాఖ్యలపై స్పందించిన గవాస్కర్

నేను ఏం తప్పుగా మాట్లాడాను చూయించండి...అనుష్క వ్యాఖ్యలపై స్పందించిన గవాస్కర్

By: Sankar Fri, 25 Sept 2020 8:20 PM

నేను ఏం తప్పుగా మాట్లాడాను చూయించండి...అనుష్క వ్యాఖ్యలపై స్పందించిన గవాస్కర్


ఐపీయల్ 2020 లో నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ విఫలం అవడంతో సునీల్ గవాస్కర్ కోహ్లీ మీద వ్యాఖ్యలు చేసాడు..అయితే ఆ వ్యాఖ్యలు అభ్యన్తరకరంగా ఉన్నాయని కోహ్లీ భార్య అనుష్క శర్మ స్పందించిన విషయం తెలిసిందే..అయితే తాజాగా అనుష్క వ్యాఖ్యలపై గవాస్కర్ స్పందించారు ..

తానేమీ అనుష్క శర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, తాను ఎక్కడ ఆ వ్యాఖ్యలు చేశానో చూపించాలన్నాడు. తాను అన్న దానిని వక్రీకరించారన్నాడు. తాను కేవలం విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మలు లాక్‌డౌన్‌ సమయంలో పోస్ట్‌ చేసిన వీడియోను ఉద్దేశిస్తూ మాత్రమే తన వ్యాఖ్యానాన్ని చెప్పానన్నాడు. లాక్‌డౌన్‌లో కోహ్లి... అనుష్క బౌలింగ్‌ను మాత్రమే ప్రాక్టీస్‌ చేశాడని మాత్రమే అన్నానని, ఈ ప్రాక్టీస్‌ సరిపోదనే ఉద్దేశమే తన వ్యాఖ్యల్లో ఉందన్నాడు. ఇందులో సెక్సీయస్ట్‌ కామెంట్లు ఏమున్నాయని గావస్కర్‌ ప్రశ్నించాడు..

లాక్‌డౌన్‌ సమయంలో అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. ఏప్రిల్‌ నెలలో క్రికెట్‌కు దూరమైన కోహ్లికి దాన్ని గుర్తు చేస్తూ ఫోర్‌ కొట్టూ అంటూ ఒకటే అల్లరి చేసేశారు. ‘ ఏయ్‌ కోలీ(కోహ్లి) చౌకా మార్‌.. చౌకా.. క్యా కర్రా’ అంటూ సరదాగా ఏడిపించే యత్నం చేసింది అనుష్క. దీనికి సంబంధించిన వీడియో అప్పుడు బాగా వైరల్‌ అయ్యింది. ఇప్పుడు తాను ఇదే వీడియో గురించి మాట్లాడానని గావస్కర్‌ చెప్పుకొచ్చారు. ఇందులో అనుష్కను తాను ఎక్కడ విమర్శించలేదన్నాడు. కోహ్లికి సరైన ప్రాక్టీస్‌ లేదనే ఉద్దేశమే తన వ్యాఖ్యల్లో ఉందన్నాడు.

Tags :
|

Advertisement