Advertisement

  • అది సరైన పద్ధతి కాదు ...క్రికెట్ లో కోడ్ భాషపై పెదవి విరిచిన సునీల్ గవాస్కర్

అది సరైన పద్ధతి కాదు ...క్రికెట్ లో కోడ్ భాషపై పెదవి విరిచిన సునీల్ గవాస్కర్

By: Sankar Thu, 10 Dec 2020 9:59 PM

అది సరైన పద్ధతి కాదు ...క్రికెట్ లో కోడ్ భాషపై పెదవి విరిచిన సునీల్ గవాస్కర్


క్రికెట్ లో ఒక్కసారిగా మైదానంలోకి దిగిన తర్వాత ఏమి చేయాలన్న ఫీల్డ్ లో ఉన్న కెప్టెన్ నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది ..ఫుట్ బాల్ లో లాగ ఇక్కడ కోచ్ లు మ్యాచ్ ల మధ్యలో సలహాలు ఇవ్వడం లాంటివి అంతగా జరగవు..

అయితే దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య గత వారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ అనలిస్ట్ నాథన్ లీమన్ జట్టు సభ్యులకు పంపిన కోడ్ సందేశంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పెదవి విరిచాడు.

క్రికెట్‌లో ఇలాంటి పద్ధతులు మంచివి కాదని తప్పుబట్టాడు. కొన్ని అక్షరాల కలయికతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్లను మార్చాలన్న సంకేతాన్ని కెప్టెన్ మోర్గాన్‌కు పంపాడు. తాము మ్యాచ్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నట్టు ఇంగ్లండ్ స్పష్టం చేసినప్పటికీ, క్రికెట్‌లో ఇలా కోడ్ పరిభాషల పద్ధతి మంచిది కాదని గవాస్కర్ పేర్కొన్నాడు. ఆటగాళ్లతో మాట్లాడేందుకు బోల్డన్ని విధానాలు అందుబాటులో ఉండగా ఇదేం పద్ధతని ప్రశ్నించాడు.

Tags :

Advertisement