Advertisement

  • కోహ్లీ జట్టులో లేకుంటేనే భారత్ విజయం సాధిస్తుంది - సునీల్ గవాస్కర్

కోహ్లీ జట్టులో లేకుంటేనే భారత్ విజయం సాధిస్తుంది - సునీల్ గవాస్కర్

By: Anji Sat, 21 Nov 2020 10:23 PM

కోహ్లీ జట్టులో లేకుంటేనే భారత్ విజయం సాధిస్తుంది - సునీల్ గవాస్కర్

ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ కు వచ్చేస్తాడు.

అప్పుడు జట్టులోని సీనియర్ ఆటగాళ్ళు చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానె జట్టుకోసం పరుగులు చేసే బాధ్యతను స్వీకరించాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కోరుకుంటున్నారు. అయితే కోహ్లీ జట్టులో లేని చాలా మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది అని గవాస్కర్ అన్నారు.

అయితే విరాట్ లేనప్పుడే భారత ఆటగాళ్లు అందరూ బాగా ఆడటానికి ప్రయత్నిస్తారు. అతను లేని లోటు తీర్చాలని చూస్తారు అని గవాస్కర్ తెలిపారు. అయితే కోహ్లీ లేన్నపుడు టెస్ట్ వైస్ కెప్టెన్ రహానె మిగిలిన మూడు మ్యాచ్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

ఈ సిరీస్ రహానే మరియు చేతేశ్వర్ పుజారాకు కఠినంగా ఉంటుంది. ఈ ఇద్దరు ఆటగాళ్ళు తమ అనుభవాన్ని మొత్తం అక్కడ చూపించాల్సి ఉంటుంది. పుజారా ను స్వేచ్ఛగా వదిలేస్తే అతను అద్భుతంగా రాణిస్తాడు.

ఇక రహానే పైన కెప్టెన్సీ భారం భారీగానే ఉంటుంది అని గవాస్కర్ అన్నాడు. అయితే 2018-19లో భారతదేశం చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో పుజారా అత్యధిక స్కోరర్‌గా 74.42 వద్ద 3 సెంచరీలు చేశాడు.

భారతదేశపు చారిత్రాత్మక 2-1 విజయానికి ఈ సౌరాష్ట్ర బ్యాట్స్మాన్ ప్రధాన కారణం. ఇందులో మొత్తం 1258 డెలివరీలను ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యధిక డెలివరీలు ఎదుర్కొన రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు పుజారా.

Tags :

Advertisement