Advertisement

  • కోహ్లీకి ఒక రూల్ ..ఆ ఆటగాడికి మరొక రూలా ..సునీల్ గవాస్కర్

కోహ్లీకి ఒక రూల్ ..ఆ ఆటగాడికి మరొక రూలా ..సునీల్ గవాస్కర్

By: Sankar Thu, 24 Dec 2020 12:37 PM

కోహ్లీకి ఒక రూల్ ..ఆ ఆటగాడికి మరొక రూలా  ..సునీల్ గవాస్కర్


టీమిండియా మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తోందని లిటిల్‌ మాస్టర్‌ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. టీమిండియాలో ఉన్న ఆటగాళ్లందరికి ఒకేలా రూల్స్‌ ఎందుకుండవని ప్రశ్నించాడు.

ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టు అనంతరం విరాట్‌ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై గవాస్కర్‌ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీకి మాత్రమే పితృత్వ సెలవులు తీసుకునే హక్కు ఉందా..? ఈ మధ్యనే టీమిండియాలో అడుగుపెట్టిన యార్కర్‌ స్పెషలిస్ట్‌ టి. నటరాజన్‌కు పితృత్వ సెలవులు ఎందుకివ్వరు.. కొత్తగా జట్టులోకి వచ్చినంత మాత్రానా ఇలా పక్షపాతం చూపించడం కరెక్ట్‌ కాదు అని చెప్పుకొచ్చాడు..

కోహ్లి విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ వ్యవహరించిన తీరును గమనిస్తే మరోసారి ఆటగాళ్లకుండే రూల్స్‌ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆసీస్‌ టూర్‌ ఉన్న ఒక యువ ఆటగాడు రూల్స్ గురించి కచ్చితంగా ఆశ్చర్యం వ్యక్తం చేసి ఉంటాడు. అతను ఎవరో కాదు.. టి. నటరాజన్. యార్కర్ల స్పెషలిస్ట్‌గా జట్టులోకి వచ్చిన అతను ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆరు వికెట్లతో సత్తా చాటాడు. నటరాజన్‌ ప్రదర్శకు ముగ్దుడైన హార్దిక్ పాండ్యా తనకి లభించిన మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌ నిజానికి నటారాజన్‌కు దక్కాల్సిందని తెలిపాడు.

Tags :
|

Advertisement