Advertisement

'పుష్ప' కథ కాపీ వివాదంపై స్పందించని సుకుమార్

By: chandrasekar Sat, 29 Aug 2020 12:31 PM

'పుష్ప' కథ కాపీ  వివాదంపై  స్పందించని సుకుమార్


కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఆచార్య మూవీ స్టోరీ సైతం తన కథ నుంచి కాపీ చేసిందేనని రాజేష్ అనే వ్యక్తి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలను ఖండిస్తూ దర్శకుడు కొరటాల శివ, చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వేర్వేరుగా ప్రెస్ నోట్ కూడా విడుదల చేసి ఆ ఆరోపణలను ఖండించారు. అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రం కూడా ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కుంటోంది. డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాని తన రచనల ఆధారంగా రూపొందించారని, తన రచనలను కాపీ చేశాడని డా వేంపల్లి గంగాధర్ అనే ప్రముఖ రచయిత ఆరోపించారు.

వేంపల్లి గంగాధర్ చేసిన ఆరోపణలతో పుష్ప సినిమా స్క్రిప్టు అంశం టాలివుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐతే, ఈ ఆరోపణలపై సుకుమార్ ఏ మాత్రం స్పందించడం ‌లేదు. పుష్ప కథకు, గంగాధర్ రచనలు చదివినప్పుడు అతని కథలకు ఎలాంటి సంబంధం లేదని అనిపించినట్టు సుకుమార్ తన సన్నిహితులకు వెల్లడించారని సమాచారం. ఇలాంటి ఆరోపణలపై స్పందించడం వల్ల అవతల వారికి ప్రచారం కల్పించినట్లవుతుంది అనే ఉద్దేశంతోనే సుకుమార్ ఈ వివాదంపై స్పందించడం లేదని ఆయన మిత్రులు చెబుతున్నారు.

Tags :
|

Advertisement