Advertisement

  • రైతుల నిరసనకు సంఘీబావంగా తన పద్మ భూషణ్ ను వదిలేసిన రాజ్యసభ ఎంపీ సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా

రైతుల నిరసనకు సంఘీబావంగా తన పద్మ భూషణ్ ను వదిలేసిన రాజ్యసభ ఎంపీ సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా

By: Sankar Thu, 03 Dec 2020 5:30 PM

రైతుల నిరసనకు సంఘీబావంగా తన పద్మ భూషణ్ ను వదిలేసిన రాజ్యసభ ఎంపీ సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్ (డెమొక్రాటిక్) చీఫ్, రాజ్యసభ ఎంపీ సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా తన పద్మభూషణ్ అవార్డును గురువారం కేంద్ర ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు.

శిరోమణి అకాలీదళ్‌ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో రాజకీయ విభేదాలతో విడిపోయి శిరోమణి అకాలీదళ్‌ (డెమొక్రాటిక్‌) పార్టీని నెలకొల్పారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2019 మార్చిలో ధిండ్సాకు పద్మ భూషణ్‌ అందజేశారు.

రెండు నెలలుగా రైతులు ధర్నా చేస్తున్న దానికి నిరసనగా నేను నా పద్మ భూషణ్‌ అవార్డును కేంద్ర ప్రభుత్వానికి తిరిగి ఇచ్చానని సుఖ్‌దేవ్‌ సింగ్‌ ధిండ్సా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మా మాటలు వినడానికి సిద్ధంగా లేదన్నారు. రైతులు తమ నిరసనను ఢిల్లీ సరిహద్దులకు మార్చారని, ఎందరో వృద్ధులు ఆందోళనా చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోన్నప్పుడు.. ఈ అవార్డు నాకు పనికిరానిదని ధిండ్సా అన్నారు...

Tags :
|

Advertisement