Advertisement

చక్కెర ధర మరింత పెరిగే అవకాశం

By: Sankar Fri, 19 June 2020 6:42 PM

చక్కెర  ధర మరింత పెరిగే అవకాశం



దేశంలో కిలో చక్కెర ధర మరో రూ.2 పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మిల్లులు ప్రస్తుతం కిలో చక్కెరను రూ.31 కనీస అమ్మకం ధర కు మించకుండా వ్యాపారులకు అమ్ముతున్నాయి. అయినా దేశంలోని చక్కెర మిల్లులు, గత సీజన్‌కు సంబంధించి రైతులకు ఇంకా రూ.22,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.

దీంతో కిలో చక్కెర ఎంఎస్‌పీని రూ.36కు పెంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. లేకపోతే ఉత్పత్తి ఖర్చులు కూడా రావని పేర్కొంది. నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసిన ఒక కమిటీ మాత్రం కిలో చక్కెర ఎంఎ్‌సపీ రూ.2 పెంచాలని సిఫారసు చేసింది. లేకపోతే మిల్లులు రైతులుకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం కష్టమని తెలిపింది. దీంతో ప్రభుత్వం చక్కెర ఎంఎస్‌పీ పెంచే విషయాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది

కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ఈ విషయం చెప్పారు. ఎంత పెంచేది ఆయన చెప్పక పోయినా, ఈ పెంపు నీతి ఆయోగ్‌ కమిటీ సూచించిన విధంగా కిలోకు రూ.2 ఉంటుందని భావిస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో రూ.38 నుంచి రూ.40 ఉన్న చక్కెర ధర మరో రూ.2 పెరిగే అవకాశం ఉందని అంచనా.


Tags :
|
|

Advertisement