Advertisement

  • సుధాకర్ దంపతులపై ప్రశంసల జల్లు కురిపించిన మెగాస్టార్

సుధాకర్ దంపతులపై ప్రశంసల జల్లు కురిపించిన మెగాస్టార్

By: chandrasekar Sat, 29 Aug 2020 12:21 PM

సుధాకర్ దంపతులపై ప్రశంసల జల్లు కురిపించిన మెగాస్టార్


మెగాస్టార్ మీద ఉన్న అభిమానంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో హీరోగా పరిచయమైన సుధాకర్ కోమాకుల మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా ఒక వీడియోను విడుదల చేశాడు.

అందులో సుధాకర్, తన భార్య హరికతో కలిసి 1984లో చిరు నటించిన 'ఛాలెంజ్' మూవీ నుంచి 'ఇందువదన కుందరదన' అనే హిట్ సాంగ్‌ను మళ్లీ అవే స్టెప్పులతో డాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వైరల్ వీడియోను వీక్షించిన చిరు, సుధాకర్ దంపతులపై ప్రశంసల జల్లు కురిపించారు. వాళ్ల ప్రేమకి, అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ చిరు ఆడియో మెసేజ్ పంపించారు.

ముఖ్యంగా సుధాకర్ భార్య హరిక ఒక సాఫ్ట్‌వేర్ టెక్కీ అయ్యుండి సుధాకర్ కంటే కూడా చాలా బాగా డాన్స్ చేసిందని చిరు హరికను మరింతగా పొగిడారు. ఈ వీడియో చూస్తుంటే తనకి తన చాలెంజ్ సినిమా షూటింగ్ రోజులు గుర్తొచ్చాయన్నారు. అలాగే సుధాకర్ దంపతులు కూడా వాళ్ల జీవితంలో ఒకరినొకరు అర్దం చేసుకొని, ప్రేమతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేలా సరదాగా, హాయిగా సాగిపోవాలి అని దీవించారు.

Tags :

Advertisement