Advertisement

  • వర్షం నుంచి తప్పించుకోవడానికి షాపింగ్ మాల్లోకి వెళ్లిన వ్యక్తిని వరించిన అదృష్టం

వర్షం నుంచి తప్పించుకోవడానికి షాపింగ్ మాల్లోకి వెళ్లిన వ్యక్తిని వరించిన అదృష్టం

By: Sankar Thu, 20 Aug 2020 08:41 AM

వర్షం నుంచి తప్పించుకోవడానికి షాపింగ్ మాల్లోకి వెళ్లిన వ్యక్తిని వరించిన అదృష్టం


అదృష్టం ఎవరికీ ఎప్పుడు ఏ రూపం లో వస్తుందో ఎవ్వరు చెప్పలేరు..ఒకోసారి అనుకోకుండా మనం చేసిన పనుల వలన కూడా మనకు అదృష్టం కలిసి రావొచ్చు..సరిగ్గా అమెరికా లో ఒక వ్యక్తికి ఇలాగె అదృష్టం కలిసి వచ్చింది..వర్షం వస్తుంది అని తడవకుండా ఉండేందుకు ఒక షాపింగ్ మాల్ లోకి వెళ్లిన వ్యక్తి బయటకు వచ్చేప్పుడు కోటి రూపాయలకు పైగా విలువ చేసే లాటరి టికెట్ తో వచ్చాడు..

వర్జీనియాలోని పీటర్స్‌బర్గ్‌కు చెందిన గార్లండ్‌ హ్యారీసన్‌ ఇటీవల పని మీద బయటకు వచ్చాడు. సరిగ్గా అప్పుడే వర్షం మొదలైంది. చేసేదేంలేక రోడ్డు పక్కన ఓ చోట ఆగాడు. వర్షం నుంచి తడవకుండా ఉండటానికి ఏం చేద్దామా.. అని ఆలోచిస్తుండగా ఎదురుగా ఓ షాపింగ్ మాల్ కనిపించింది. నేరుగా ఆ షాపులోకి వెళ్లాడు.

వర్షం నుంచి తప్పించుకోవడానికి షాపింగ్‌ మాల్‌లోకి వచ్చిన హ్యారీసన్ అక్కడ షాపింగ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఈ క్రమంలో సరదాగా ఓ లాటరీ టికెట్‌ కొనుక్కొని పాకెట్‌లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు. ఆ లాటరీ టికెట్ ఇంట్లో పెట్టి దాని గురించి మరిచిపోయాడు.

లాటరీ ఫలితాలు వచ్చిన విషయం తెలుసుకున్న హ్యారీసన్.. తన టికెట్ తీసి నంబర్ పరిశీలించాడు. ఇంకేం.. ఆ వెంటనే అతడి మొఖంలో 100 ట్యూబ్‌లైట్ల వెలుతురు వచ్చింది. తను కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు ఏకంగా 1,58,377 డాలర్లు (దాదాపు కోటి 18 లక్షల రూపాయలు) నగదు బహుమతి వచ్చింది. వెంటనే లాటరీ వెనుకాల ఉన్న ఫోన్ నంబర్‌కు (వర్జీనియా లాటరీ) కాల్ చేసి వారికి సమాచారం ఇచ్చాడు. అక్కడికి వెళ్లి లాటరీ డబ్బులు తీసుకొని ఇంటికి తిరిగొచ్చాడు.

Tags :

Advertisement