Advertisement

హైద్రాబాద్లో ఒక్కసారిగా భారీ వర్షం

By: Sankar Thu, 10 Sept 2020 5:40 PM

హైద్రాబాద్లో ఒక్కసారిగా భారీ వర్షం


హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి అప్పుడప్పుడు ఎండ కొట్టినా.. కొద్దిసేపటి క్రితం మేఘావృతమైంది.

ప్రస్తుతం చాలా ఏరియాల్లో వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫిలీంనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో భారీ వర్షం కురిసింది. అలాగే సైదాబాద్, మలక్‌పేట, ముషీరాబాద్, చాదర్‌ఘాట్‌, రాంనగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయినట్లు సమాచారం అందుతోంది.

అయితే ప్రధాన కూడళ్లలో మాత్రం నీళ్లు ఆగిపోవడంతో.. ట్రాఫిక్ నెమ్మదిగా వెళుతోంది. గత కొద్ది రోజులుగా ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు భారీ వర్షంతో ఉపశమనం లభించింది. పలు ప్రాంతాల్లో రోడ్డుపైకి వర్షపునీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Tags :
|
|

Advertisement