Advertisement

  • హైదరాబాద్ లో భూప్రకంపనలు ..భయబ్రాంతులకు గురి అయిన ప్రజలు

హైదరాబాద్ లో భూప్రకంపనలు ..భయబ్రాంతులకు గురి అయిన ప్రజలు

By: Sankar Thu, 22 Oct 2020 4:33 PM

హైదరాబాద్ లో భూప్రకంపనలు ..భయబ్రాంతులకు గురి అయిన ప్రజలు


ఇప్పటికే వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ లో భూప్రకంపనలు రావడం కలకలం రేపింది..నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి ఉన్నట్టుండి స్వల్పంగా కంపించింది. అయితే, ఈ ప్రకంపనలు పలు సార్లు వరుసగా జరగడం గమనార్హం. నగరంలోని వస్థలీపురం బీఎన్‌రెడ్డి నగర్‌, వైదేహినగర్‌లో గురువారం వేకువ జామున భూ ప్రకంపనలు వచ్చాయి.

తెల్లవారు జామున 5.40 గంటల సమయంలో సెకను పాటు భూమి కంపించింది. శబ్దాలు రావడంతో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు పెట్టారు. మూడుసార్లు స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం 5.40 గంటలకు ఒకసారి, 6.45గంటలకు మరోసారి వైదేహీ నగర్‌లో పెద్దశబ్దంతో భూమి కంపించింది. 7.08 గంటలకు మూడోసారి ప్రకంపనలు వచ్చాయి.

వరుసగా మూడుసార్లు భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ స్వల్ప భూ ప్రకంపనలపై ఎన్‌జీఆర్ఐ డైరెక్టర్ తివారీ స్పందించారు. భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 0.5గా నమోదైందని తెలిపారు.స్వల్ప ప్రకంపనలు కావడంతో ఆస్థి నష్టం , ప్రాణ నష్టం ఏమి సంభవించలేదు

Tags :

Advertisement