Advertisement

  • విజయవంతంగా నింగికెగసిన పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్‌

విజయవంతంగా నింగికెగసిన పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్‌

By: chandrasekar Sat, 07 Nov 2020 4:56 PM

విజయవంతంగా నింగికెగసిన పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్‌

విజయవంతంగా పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్‌ నింగికెగసింది. పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. 13.55 నిమిషాల్లో ప్రయోగం పూర్తయ్యింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలో శాస్త్రవేత్తలు ప్రవేశ పెట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ఉన్న మొదటి ప్రయోగ వేదిక నుంచి ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్‌ ద్వారా మన దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-01తో పాటు అమెరికా, లక్సెంబర్గ్‌ దేశాలకు చెందిన ఉపగ్రహాలు నాలుగు చొప్పున, లిథువేనియా దేశానికి చెందిన ఒక ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టారు. ఇవాళ ఇస్రో శాస్త్రవేత్త‌లు విజ‌య‌వంతంగా ప‌ది ఉప‌గ్ర‌హాల‌ను క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టారు.

ఇస్రో శ్రీహరికోట నుండి పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ల‌ను ప్ర‌యోగించారు. 575 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న క‌క్ష్య‌లోకి శాటిలైట్ల‌ను ప్ర‌వేశపెట్టారు. ఇస్రోకు చెందిన EOS-01తో పాటు విదేశాల‌కు చెందిన 9 ఉపగ్ర‌హాల‌ను ప్ర‌యోగించారు. శ్రీహ‌రికోట నుంచి ఇవాళ మ‌ధ్యాహ్నం 3.10 నిమిషాల‌కు పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ నింగికి ఎగిరింది. ఈ రాకెట్‌తో ఈఓఎస్‌-1 శాటిలైట్‌తో పాటు మ‌రో 9 క‌స్ట‌మ‌ర్ శాటిలైట్లు నింగిలోకి దూసుకువెళ్లాయి. పీఎస్ 1 ప‌ర్ఫార్మెన్స్ నార్మ‌ల్‌గా సాగింది. పీఎస్‌2 కూడా నార్మ‌ల్‌గా కొన‌సాగింది. పేలోడ్ ఫేరింగ్ కూడా అనుకున్న‌ట్లే స‌ప‌రేట్‌ అయ్యింది. పీఎస్ఎల్వీ బ‌రువు 290 ట‌న్నులు. అన్ని ద‌శ‌లు అనుకున్న రీతిలో పూర్తి అయ్యాయి.

Tags :

Advertisement