Advertisement

  • విజయవంతంగా ప్రయోగించిన పిఎస్ఎల్వి సి-50 ఉపగ్రహం

విజయవంతంగా ప్రయోగించిన పిఎస్ఎల్వి సి-50 ఉపగ్రహం

By: chandrasekar Thu, 17 Dec 2020 10:15 PM

విజయవంతంగా ప్రయోగించిన పిఎస్ఎల్వి సి-50 ఉపగ్రహం


శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C-50 ఉపగ్రహం ఈరోజు గురువారం మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు విజయవంతంగా నింగికెగసింది.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోచైర్మన్ శివం మాట్లాడుతూ కేవలం 22 నిమిషాల్లోనే ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏడు సంవత్సరాల పాటు మనకు సేవలను అందించనున్నట్లు తెలిపారు.

ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడంతో మన శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ శివన్ అభినందనలు తెలిపారు.ఇప్పుడు ప్రయోగించిన ఉపగ్రహం CMS- 01 ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం లో విస్తరించిన C-బ్యాండ్ సేవలను అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.ఇంతకుముందు కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం ప్రయోగించబడిన జీశాట్-12 ఉపగ్రహం జీవితకాలం ముగియనుండడంతోఈ కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు తెలిపారు.మనం నింగిలోకి పంపిన ఎక్కువశాతం ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ వాహక నౌక ద్వారా ప్రయోగించినట్లు తెలిపారు.

Tags :
|

Advertisement