Advertisement

  • విజయవంతమైన ప్లాస్మా చికిత్స...ఢిల్లీలో మరో ప్లాస్మా బ్యాంక్

విజయవంతమైన ప్లాస్మా చికిత్స...ఢిల్లీలో మరో ప్లాస్మా బ్యాంక్

By: chandrasekar Tue, 14 July 2020 3:42 PM

విజయవంతమైన ప్లాస్మా చికిత్స...ఢిల్లీలో మరో ప్లాస్మా బ్యాంక్


మరో ప్లాస్మా బ్యాంకును దేశ రాజధాని ఢిల్లీ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ప్లాస్మా థెరపీతో కరోనా బాధితులు త్వరగా కోలుకుంటున్నారని తేలడంతో లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రారంభించనున్నారు.

రాజధానిలో ప్రారంభించిన ప్లాస్మా చికిత్స విజయవంతమైందని, దీన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి మనీష్ సిసోడియా పేర్కొన్నారు.

ఎల్‌ఎన్‌జేపీ దవాఖాన డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రితు సక్సేనా మాట్లాడుతూ రాజధానిలో అతిపెద్ద కరోనా చికిత్సా కేంద్రంగా దవాఖాన ఉన్నందున రెండో ప్లాస్మా బ్యాంక్ అవసరం ఉందని చెప్పారు.

మరో 200 మంది రోగులకు ప్లాస్మా థెరపీ ఇవ్వడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దవాఖానకు అనుమతి ఇచ్చిందని ఆమె తెలిపారు. ఎల్‌ఎన్‌జేపీలో 5వేల మంది కరోనా నుంచి కోలుకున్నారని, వారిని సంప్రదించి ప్లాస్మా దానం చేయాలని కోరుతామన్నారు.

ఈ మేరకు దవాఖానలో చేసిన ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి సిసోడియా సమీక్షించినట్లు డాక్టర్ సక్సేనా తెలిపారు.

Tags :
|

Advertisement