Advertisement

టీటీడీ విషయంపై సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు

By: chandrasekar Wed, 27 May 2020 6:12 PM

టీటీడీ విషయంపై సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు


టీటీడీ భూముల వేలానికి సంబంధించిన అంశంపై పోరాటం చేయాలని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఊహించని షాక్ ఇచ్చారు. తిరుమల ఆస్తుల అమ్మకంపై టీడీపీ, బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

దేవుడిపైన అబద్ధాలు చెప్పడం సరైనది కాదని న్యూస్18‌ డిబేట్‌లో వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే టీడీపీ, బీజేపీ కలిసి టీటీడీ ఆస్తులు అమ్మాలని నిర్ణయించినట్లు సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. దీని కోసం నియమించిన కమిటీలో బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారని అన్నారు. టీటీడీ ఆ నిర్ణయం తీసుకున్న సమయంలో తమ పార్టీకి చెందిన నాయకుడు దేవాదాయ శాఖకు మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలోనే ఆస్తుల అ‍మ్మకాల నిర్ణయాలు తీసుకున్నారని సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు.

శ్రీవారి ఆస్తులను అమ్మకూడదని స్పష్టం చేశారు. వాటిని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నానని వ్యాఖ్యానించారు.

Tags :
|
|

Advertisement