Advertisement

  • కరోనా పాజిటివ్ వచ్చి పరీక్ష రాయలేకపోయినవారికి మరొక అవకాశం ఇచ్చిన ఏపీ

కరోనా పాజిటివ్ వచ్చి పరీక్ష రాయలేకపోయినవారికి మరొక అవకాశం ఇచ్చిన ఏపీ

By: Sankar Tue, 29 Sept 2020 11:17 AM

కరోనా పాజిటివ్ వచ్చి పరీక్ష రాయలేకపోయినవారికి మరొక అవకాశం ఇచ్చిన ఏపీ


ఏపీలో ఎంసెట్ పరీక్ష ముగిసిన విషయం తెలిసిందే..అయితే కరోనా కారణంగా కొంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేకపోయారు..అయితే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడిఉన్న పరీక్షా కావడంతో , కరోనా వచ్చి పరీక్షా రాయలేకపోయిన విద్యార్థులకు మరొక అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ..

క్వారంటైన్‌లో ఉండి ఎంసెట్‌ రాయలేకపోయిన విద్యార్థులకు మరోసారి ఆ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ ఎంసెట్‌ చైర్మన్, జేఎన్‌టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు తాము పరీక్ష రాయలేకపోయామని, మరోసారి అవకాశం కల్పించాలని కోరినట్టు పేర్కొన్నారు.వారు ఏపీ ఎంసెట్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ మెయిల్‌ ఐడీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు

అదే విధంగా ఎంసెట్‌ హాల్‌ టికెట్, కోవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టులను ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పంపించాలని సూచించారు. వీరికి ఆన్‌లైన్లో పరీక్ష నిర్వహించే తేదీని ఎంసెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలియచేస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వి.రవీంద్ర తెలిపారు. వివరాలకు 0884–2340535, 2356255ను సంప్రదించాలని ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు సూచించారు.

Tags :
|

Advertisement