Advertisement

  • అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ సీట్లవైపు విద్యార్థుల ఆసక్తి...

అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ సీట్లవైపు విద్యార్థుల ఆసక్తి...

By: chandrasekar Wed, 16 Dec 2020 3:42 PM

అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ సీట్లవైపు విద్యార్థుల ఆసక్తి...


ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు ప్రస్తుతం అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ సీట్లవైపు ఆసక్తి చూపుతున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్‌ ఎన్నారై కోటాలో ఒక్కో సీటు రూ.34 లక్షలు ఉండగా పేమెంట్‌ కోటా సీటు రూ.14 లక్షలు. ఉద్యోగం కచ్చితంగా వస్తుందన్న ఆశ ఉండటంతో ఇంత మొత్తం వెచ్చించడానికి తల్లిదండ్రులు కూడా వెనుకాడటం లేదు. లక్షలు ఖర్చైనా సరే సీటు దొరికితే జాబ్‌ గ్యారంటీ అని నమ్ముతున్నారు. దీంతో ఇప్పుడు ఏటా ఒక్క సీటు కూడా మిగలటం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీల్లోనే ఈ కోర్సులు అందుబాటులో ఉండటం, పైగా సీట్లు తక్కువగా ఉండటంతో పోటీ అనివార్యం అయ్యింది. ఒక్కో సీటుకు సుమారు 50 మంది వరకు పోటీ పడుతుండటం గమనార్హం. లక్షలు ఖర్చు పెట్టి ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌ చేయించే బదులు అవే డబ్బులు పెట్టి అగ్రికల్చర్‌ కోర్సు చదివిస్తే బెటర్‌ అన్న ఆలోచనలో ఉంటున్నారు. ప్రభుత్వ సంస్థల్లోనే కాకుండా, ప్రైవేటు సంస్థల్లోనూ మంచి ఆఫర్లు ఉండటమే ఇందుకు రీసన్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరు అగ్రికల్చర్‌ కాలేజీల్లో మొత్తం 552 సీట్లు ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలు కూడా అగ్రి, హార్టికల్చర్‌ సీట్ల డిమాండ్‌కు కారణంగా ఉన్నాయి. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో మాదిరిగా అగ్రికల్చర్‌ కోర్సులో పేమెంట్‌ సీటే కదా పైసలు కట్టేసి చేరిపోదామనుకుంటే కుదరదు. ఫీజు చెల్లించే స్థోమత ఉన్నా చదువులో మెరిట్‌ ఉండాల్సిందే. పేమెంట్‌, ఎన్నారై కోటా సీట్లకు కూడా అధికారులు ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. జనరల్‌ కోటా సీట్లు పూర్తయ్యాక మిగిలిన విద్యార్థులకు మెరిట్‌ ప్రకారం ఈ సీట్లను కేటాయిస్తారు.

ప్రైవేటులో ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల మాదిరిగా అగ్రిల్చర్‌ కాలేజీలు ఏర్పాటు చేయటం సులువు కాదు. ఈ కాలేజీల ఏర్పాటుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్ కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నది. బీఎస్సీ అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ కోర్సుల్లో పేమెంట్‌ కోటా సీట్ల భర్తీకి జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 23న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నది. ఎంసెట్‌లో 128 ర్యాంకు నుంచి 9,991 ర్యాంకు సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని పేర్కొన్నది. కాళేశ్వరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతులు సాగువైపు మళ్లారు. ఇదే సమయంలో పంటలపై ప్రయోగాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో.. మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సీట్లపట్ల మక్కువ చూపుతున్నారు. చదువులో నాణ్యతను దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలు తీసుకొచ్చింది. అగ్రికల్చర్‌ బీఎస్సీలో ఎక్కువగా ప్రాక్టికల్‌ ఓరియంటేషన్‌ విధానమే ఉంటుంది. పంటలపై ఎన్నో ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులను ప్రత్యక్షంగా పంట పొలాల్లో తిప్పుతూ వారికి పాఠాలను బోధించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి అగ్రికల్చర్‌ కాలేజీకి సొంతంగా వ్యవసాయ భూమి ఉండాలనేది ఐకార్‌ ప్రధాన నిబంధన. అగ్రికల్చర్‌ కాలేజీ ఏర్పాటు చేయాలంటే కనీసం 70 ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలి. దీంతో పాటు మరికొన్ని కఠిన నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు అగ్రికల్చర్‌ కాలేజీ పెట్టడానికి ఎవరూ సాహసించడం లేదు.

Tags :

Advertisement