Advertisement

  • నన్ను తొలగించడంపై నాకు కోపంతో పాటు విసుగు కలుగుతుంది ..స్టువర్ట్ బ్రాడ్

నన్ను తొలగించడంపై నాకు కోపంతో పాటు విసుగు కలుగుతుంది ..స్టువర్ట్ బ్రాడ్

By: Sankar Fri, 10 July 2020 8:24 PM

నన్ను తొలగించడంపై నాకు కోపంతో పాటు విసుగు కలుగుతుంది ..స్టువర్ట్ బ్రాడ్



ఇంగ్లాండ్ క్రికెట్ లో గత దశాబ్ద కాలంగా టెస్ట్ క్రికెట్ లో బౌలింగ్ భారాన్ని మోస్తున్న ఆటగాళ్లు ఆండర్సన్ , బ్రాడ్ ..ఈ ఇద్దరి దిగ్గజ బౌలర్లు ఇంగ్లాండ్ విజయాలలో కీలక పాత్ర పోషించారు ..అయితే తాజాగా నాలుగు నెలల తర్వాత ఇంగ్లాండ్ , వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ మొదలయింది ..ఈ సిరీస్లో మొదటి టెస్ట్ కు రూట్ లేకపోవడంతో బెన్ స్టోక్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు ..అయితే తొలి టెస్ట్ జట్టు ప్రకటించిన ఇంగ్లాండ్ లో ఎవ్వరు ఊహించని ఒక అనూహ్య మార్పు జరిగింది ..అదే స్టువర్ట్ బ్రాడ్ కు జట్టులో స్థానం దక్కపోవడం ..అతని స్థానంలో ఆర్చర్ ను తీసుకున్నారు ..దీనితో అందరు షాక్కు గురి అయ్యారు ..

ఇదే విషయమై బ్రాడ్ మాట్లాడుతూ అస‌లు న‌న్ను ఎందుకు ప‌క్క‌న పెట్టార‌న్న‌ది ఇప్ప‌టికి అర్థం కావ‌డం లేదు .నేను చాలా నిరాశ‌లో కూరుకుపోయా. మంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడు నన్ను ఇలా చేయ‌డం న‌చ్చ‌లేదు. మ్యాచ్‌కు ఒక‌రోజు ముందు బెన్ ‌స్టోక్స్ నా ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. సౌంతాప్ట‌న్ పిచ్ పేస‌ర్ల‌కు బాగా అనుకూలిస్తుంది.. అందుకే అద‌న‌పు పేస్ బౌల‌ర్ అవ‌స‌రం ప‌డుతుంది అని చెప్పాడు. కానీ అనూహ్యంగా న‌న్ను ప‌క్క‌న‌బెట్టి జోఫ్రా ఆర్చ‌ర్‌కు అవ‌కావ‌మిచ్చారు.

జోఫ్రా ఎంపిక‌పై నేను త‌ప్పు బ‌ట్ట‌ను.. ఎందుకో కానీ ఈ విష‌యాన్ని నేను జీర్ణంచుకోలేక‌పోతున్నా. ద‌శాబ్ద కాలంగా జ‌ట్టుతో పాటు కొన‌సాగుతున్నా.. ఈ ద‌శాబ్ద కాలంలో ఇంగ్లండ్‌ను ఎన్నో మ్యాచ్‌ల్లో గెలిపించా. క‌రోనాకు ముందు జ‌రిగిన యాషెస్ సిరీస్‌, ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో అద్భ‌తంగా బౌలింగ్ చేశా. కానీ ఫామ్‌లో ఉన్న బౌల‌ర్‌ని ప‌క్క‌న బెట్ట‌డం న‌చ్చ‌లేదు. అందుకే ఈ విష‌యంలో నాకు కోపంతో పాటు విసుగు వ‌చ్చింది.' అంటూ ఇంగ్లండ్ వెటెర‌స్ బౌల‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

Tags :
|
|
|

Advertisement