Advertisement

  • నివర్‌ తుఫాను: 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు..నెల్లూరులో 10 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం...

నివర్‌ తుఫాను: 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు..నెల్లూరులో 10 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం...

By: chandrasekar Wed, 25 Nov 2020 5:52 PM

నివర్‌ తుఫాను: 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు..నెల్లూరులో 10 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం...


నివర్‌ తుఫాను నేడు పుదుచ్చేరిలో తీరం దాటనుంది. దీని ప్రభావంతో తమిళనాడులో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ, కర్ణాటక రాష్ట్రాలపై కూడా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ సాయంత్రం కరైకల్‌, మామళ్లపురం మధ్య తుఫాను తీరాన్ని తాకుతుందని ప్రకటించింది. ఆ సమయంలో 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

రేపు, ఎల్లుండి తమిళనాడులోని కడలూరు, విళ్లుపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా ఆగ్నేయ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కర్ణాటకపైనా కొంతవరకు తుఫాను ప్రభావం ఉంటుందని అంచాన.

నివర్‌ తుఫాను ముంచుకొస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఏపీ తీరాన్ని తాకకపోయినా ప్రభావం ఉంటుందన్న అంచనాతో ప్రభుత్వం నష్టనివారణకు చర్యలు చేపట్టింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లకు సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు. దీంతో రెండు జిల్లాల యంత్రాంగం సర్వన్నద్ధమయ్యింది. నెల్లూరు జిల్లాతోపాటు చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీచేసింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని సూచించింది. నెల్లూరు జిల్లాలోని అనే ప్రాంతాల్లో 10 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది.

Tags :
|
|
|

Advertisement