Advertisement

  • క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.. అనంతపురం ఎస్పీ

క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.. అనంతపురం ఎస్పీ

By: Sankar Sun, 18 Oct 2020 8:46 PM

క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.. అనంతపురం ఎస్పీ


ప్రస్తుతం ఎక్కడ చుసిన ఐపీయల్ ఫీవర్ నడుస్తుంది ..కరోనా టైములో ఐపీయల్ అనేది అభిమానులను బాగా కట్టుకుంటుంది కానీ ఇదే సమయంలో చాల మంది క్రికెట్ బెట్టింగ్ లకు కూడా పాల్పడుతున్నారు ..

దీనితో క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అన్నారు. ఆన్‌లైన్ బెట్టింగుల‌కు పాల్ప‌డుతూ యువ‌త పెడ‌దోవ ప‌డుతోంద‌న్నారు.

బెట్టింగుల‌పై త‌ల్లిదండ్రులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, విద్యార్ధుల క‌ద‌లిక‌లపై జాగ్ర‌త్త వ‌హించాల‌ని కోరారు. క్రికెట్ బెట్టింగ్ వెనుక అంత‌ర్జాతీయ రాకెట్ ప్ర‌మేయం ఉంద‌ని ఇప్ప‌టివ‌ర‌కు 151 మంది అరెస్ట్ చేసి 8,34,320 రూపాయ‌ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇక మ‌రోవైపు ద్విచక్ర వాహనాలు చోరీ ముఠా గుట్టును ర‌ట్టుచేశారు. ఈ కేసులో ఇద్ద‌రు దుండ‌గుల‌ను అరెస్ట్ చేయ‌గా, మ‌రొక‌రు ప‌రారీలో ఉన్న‌ట్లు తెలిపారు. నిందితుల నుంచి 32 ద్విచ‌క్ర వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు.

Tags :

Advertisement