Advertisement

  • షావోమి నుంచి ఎంఐ టీవీ స్టిక్‌ పేరుతో స్ట్రీమింగ్ డివైజ్‌

షావోమి నుంచి ఎంఐ టీవీ స్టిక్‌ పేరుతో స్ట్రీమింగ్ డివైజ్‌

By: chandrasekar Mon, 10 Aug 2020 10:52 AM

షావోమి నుంచి ఎంఐ టీవీ స్టిక్‌ పేరుతో స్ట్రీమింగ్ డివైజ్‌


ఎంఐ టీవీ స్టిక్‌ పేరుతో స్ట్రీమింగ్ డివైజ్‌ను ప్రముఖ మొబైల్‌ఫోన్‌ తయారీ సంస్థ షావోమి అందుబాటులోకి తెచ్చింది. షావోమి నుంచి వచ్చిన రెండో స్ట్రీమింగ్ డివైజ్‌ ఇది. గతంలో ఎంఐ బాక్స్‌ 4ఎక్స్‌ పేరుతో షావోమి స్ట్రీమింగ్ డివైజ్‌ ను ప్రవేశ పెట్టింది.

ఎంఐ స్టిక్ ఫీచర్లు : ఎంఐ టీవీ స్టిక్‌లో క్వాడ్‌కోర్‌ కోర్‌టెక్స్‌-ఏ53 సీపీయు, ఏఆర్‌ఎం మలి-450 జీపీయు ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 9 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది.

ఇందులో 1జీబీ ర్యామ్‌/8జీబీ ఇంటర్నల్ మెమరీ వేరియంట్‌లో ఇది లభించనుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, అమెజాన్‌ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, హెచ్‌బీవో, స్పోటిఫైతో పాటు ఇతర వాటిని డైరెక్టుగా టీవీలో వీక్షించే అవకాశం కల్పించింది.

మంచి క్వాలిటీ సౌండ్, పిక్చర్ దీని స్వంతం. అన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌తో గూగుల్ ప్లేస్టోర్‌ను యాక్సెస్ చేసుకునే సౌకర్యం ఉంది. ఇందులోని రిమోట్ వాయిస్‌ కంట్రోల్స్‌, గూగుల్ అసిస్టెంట్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఎంఐ టీవీ స్టిక్ ధర రూ. 2,799గా సంస్థ నిర్ణయించింది. ఎంఐ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ స్టోర్లలో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Tags :
|
|
|

Advertisement