Advertisement

  • బ్లాక్ వుడ్ ఏకాగ్రతను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన స్టోక్స్

బ్లాక్ వుడ్ ఏకాగ్రతను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన స్టోక్స్

By: chandrasekar Thu, 16 July 2020 5:25 PM

బ్లాక్ వుడ్ ఏకాగ్రతను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన స్టోక్స్


వెస్టిండీస్ బ్యాట్స్ మన్ బ్లాక్ వుడ్ ఇంగ్లండ్ తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 95పరుగులతో అదరగొట్టాడు. ఆతిథ్య జట్టుపై విండీస్ నాలుగు వికెట్ల తేడాతో గెలువడంలో ప్రధానపాత్ర పోషించాడు.

అయితే, తాను రెండో ఇన్నింగ్స్ కోసం అడుగుపెట్టాక తొలి బంతి నుంచే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తనను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడని బ్లాక్ వుడ్ బుధవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏవేవో మాటలతో తన ఏకాగ్రతను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించాడని ఆరోపించాడు.

“మొదటి బంతి నుంచే ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ నన్ను ఏదో ఒకటి అనడం ప్రారంభించాడు. నేను కోపంతో చెత్త షాట్ ఆడేలా చేయాలని ప్రయత్నించాడు. అయితే నేను ఏ దశలోనూ చిరాకు పడలేదు. నేను క్రీజులో ఉంటే వారు ఒత్తిడిలో ఉంటారు. అయితే స్టోక్స్ ఏమన్నాడో నాకు స్పష్టంగా వినపడలేదు. క్రికెట్ లో అలానే జరుగుతుంది. మాట్లాడుతుంటే కాస్త వినిపిస్తున్నా ఒక్కోసారి స్పష్టంగా అర్థం కాదు” అని బ్లాక్ వుడ్ చెప్పాడు.

200 పరుగుల లక్ష్యఛేదనలో 27 పరుగులకే విండీస్ మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన బ్లాక్ వుడ్ శతకానికి ఐదు పరుగుల దూరంలో ఔటై.. జట్టును విజయ తీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు గురువారం ప్రారంభం కానుంది.

Tags :
|
|

Advertisement