Advertisement

  • జో రూట్ జట్టులో లేడా..ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్

జో రూట్ జట్టులో లేడా..ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్

By: Sankar Wed, 02 Sept 2020 12:13 PM

జో రూట్ జట్టులో లేడా..ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్


ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో లిమిటెడ్ ఓవర్ల ఫార్మటు లో దూసుకుపోతున్న జట్టు ఏది అంటే అందరు చెప్పే మాట ఇంగ్లాండ్ అని, గత రెండు మూడేళ్ళుగా అత్యంత దూకుడు అయిన ఆటతీరుతో ప్రత్యర్థుల గుండెలలో గుబులు పుట్టిస్తుంది..

ఇలా దూకుడైన ఆటతీరుకోసం ఆటగాళ్లను కూడా అలాగే ఎంచుకుంటుంది..దీనితో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు టెస్ట్ కెప్టెన్ జో రూట్ కు టి ట్వంటీ జట్టులో చోటు దక్కలేదు..వన్ డే లకు జో రూట్ ను ఎంపిక చేసిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు టి ట్వంటీ లలో మాత్రం జో రూట్ కు విశ్రాంతి ఇచ్చింది..

అయితే మూడు ఫార్మాట్లలోనూ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా ఉన్న జో రూట్‌ టీ20 టీమ్‌లో లేకపోవడమేంటి..? అని స్టీవ్‌స్మిత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీ20 సిరీస్‌లో జో రూట్‌కి చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతను మూడు ఫార్మాట్లలోనూ అద్భుతమైన ఆటగాడు. బహుశా.. దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్‌లకే ఇంగ్లాండ్ టీ20 టీమ్‌లో చోటు దక్కిందేమో..? అయితే.. ఎవరి గేమ్ ప్లాన్‌లు వారికి ఉంటాయి. అందరూ ఒకేలా ఆడితే.. బోర్ కొడుతుంది’’ అని స్టీవ్‌స్మిత్ వెల్లడించాడు.

Tags :

Advertisement