Advertisement

  • కోహ్లీ ఒక అద్భుతం ..ధోని లెజెండ్ ..స్టీవ్ స్మిత్..

కోహ్లీ ఒక అద్భుతం ..ధోని లెజెండ్ ..స్టీవ్ స్మిత్..

By: Sankar Tue, 16 June 2020 2:10 PM

కోహ్లీ ఒక అద్భుతం ..ధోని లెజెండ్ ..స్టీవ్ స్మిత్..


అభిమానులతో ఇంస్టాగ్రామ్ చాట్ లో ఆస్ట్రేలియా స్టార్ బాట్స్మన్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానం లో ఉన్న స్టీవెన్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు ..అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు స్మిత్ సమాధానాలు ఇచ్చాడు ..ఈ చాట్‌లో భారత క్రికెటర్ల గురించి కూడా అతను తన అభిప్రాయాలు వెల్లడించాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో రవీంద్ర జడేజా అత్యుత్తమ ఫీల్డర్‌ అని స్మిత్‌ ప్రశంసించాడు. కేఎల్‌ రాహుల్‌ ఆట తనకు బాగా నచ్చుతుందన్న ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్, పాక్‌ బౌలర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ను ఎదుర్కోవడంలో తాను ఇబ్బంది పడతానని వెల్లడించాడు. ధోనిని దిగ్గజంగా అభివర్ణించిన స్మిత్‌... కోహ్లిని ‘ఒక అద్భుతం’గా ప్రశంసించాడు. ఈ ఏడాది చివర్లో సొంతగడ్డపై భారత్‌తో జరిగే సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఈ వరల్డ్‌ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ అన్నాడు.

ఇక ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన 2016-17 టెస్ట్ సిరీస్లో పూణే లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో స్మిత్ చేసిన సెంచరీ ..ఇండియా గడ్డ మీద ఒక విదేశీ ఆటగాడు చేసిన అద్భుత సెంచరీలలో ఒకటిగా నిలిచిపోయింది..గింగిరాలు తిరుగుతున్న పిచ్ మీద రెండు ఇన్నింగ్సలలో కలిపి భారత బాట్స్మన్ కేవలం ఒక అర్థ సెంచరీ మాత్రమే చేస్తే స్మిత్ అద్భుతంగా ఆది సెంచరీ సాధించాడు

ఆసీస్‌ 333 పరుగులతో గెలిచిన ఈ మ్యాచ్‌లో తన ఇన్నింగ్స్‌ గురించి స్మిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాని గొప్పతనం గురించి చెప్పమంటే జారవిడిచిన క్యాచ్‌లే కారణమని వెల్లడించాడు.అదృష్టం కలిసొచ్చింది. నేను ఇచ్చిన క్యాచ్‌లను భారత ఆటగాళ్లు ఐదు సార్లు వదిలేశారు. అంటే ఒక్కోదానికి లెక్క వేసుకుంటే ఐదు సార్లు 20 పరుగుల చొప్పున చేశానంతే’ అని స్మిత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ చాట్‌లో అభిమానికి బదులిచ్చాడు.

Tags :
|
|
|

Advertisement