Advertisement

  • స్టీవ్ స్మిత్ పై మరొకసారి పైచేయి సాధించిన అశ్విన్

స్టీవ్ స్మిత్ పై మరొకసారి పైచేయి సాధించిన అశ్విన్

By: Sankar Sat, 26 Dec 2020 2:57 PM

స్టీవ్ స్మిత్ పై మరొకసారి పైచేయి సాధించిన అశ్విన్


స్టీవ్ స్మిత్ ప్రస్తుత క్రికెట్ లో అత్యుత్తమ టెస్ట్ బాట్స్మెన్ గా పేరుగాంచిన ఆటగాడు ..గత ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆస్ట్రేలియా మీద సిరీస్ గెలిచింది ..అయితే ఆ సిరీస్ లో స్మిత్ లేకపోవడం వల్లనే టీమిండియా విజయం సాధించింది అని అన్నారు అంటే స్మిత్ ఆస్ట్రేలియాకు ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్ అన్నది అర్థం అవుతుంది...దానికి తగ్గట్లే ఇంతకుముందు ఇండియా మీద ప్రతిసారి సెంచరీల మీద సెంచరీలు చేసిన స్మిత్ ప్రస్తుత పర్యటనలో మాత్రం తేలిపోతున్నాడు..

ఫస్ట్ టెస్ట్ లో అశ్విన్ బౌలింగ్ లో సింగల్ డిజిట్ కె వెనుదిరిగిన స్మిత్ , తాజాగా సెకండ్ టెస్ట్ లో కూడా అశ్విన్ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు ఈ సారి మరింత దారుణంగా సున్నాకే వెనుదిరిగాడు...అయితే విదేశాలలో అంతగా రాణించలేదు అని ముద్ర పడిన అశ్విన్ ఈ సిరీస్ లో మాత్రం విజృంబిస్తున్నాడు..ముఖ్యంగా స్మిత్ ను ఏ మాత్రం కుదురుకుని ఛాన్స్ ఇవ్వడంలేదు..దీంతో స్మిత్ ను అరికట్టేందుకు టీమిండియ భారీగానే హోమ్ వర్క్ చేసింది అని అభిమానులు చర్చించుకుంటున్నారు...

కాగా మెల్బోర్న్ డే టెస్ట్ లో టీమిండియా తొలి రోజు పైచేయి సాధించింది...టాస్ ఒడి బౌలింగ్ కు దిగిన భారత్ వరుస విరామాలతో వికెట్లు తీసి ఆస్ట్రేలియాను కేవలం 195 పరుగులకే ఆల్ అవుట్ చేసింది ..ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియ మయాంక్ వికెట్ కోల్పోయినప్పటికీ పుజారా , గిల్ మరొక వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో తొలి రోజును భారత్ విజయవంతంగా ముగించింది...

Tags :
|

Advertisement