Advertisement

  • సెంచరీతో చెలరేగిన స్మిత్ ..భారత్ మీద అరుదయిన రికార్డు సొంతం

సెంచరీతో చెలరేగిన స్మిత్ ..భారత్ మీద అరుదయిన రికార్డు సొంతం

By: Sankar Sun, 29 Nov 2020 1:58 PM

సెంచరీతో చెలరేగిన స్మిత్ ..భారత్ మీద అరుదయిన రికార్డు సొంతం


ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ స్టీవ్‌ స్మిత్‌ టీమిండియాపై అరుదైన రికార్డు సాధించాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో స్టీవ్‌ స్మిత్‌ వరుసగా రెండో సెంచరీ సాధించాడు. మొదటి వన్డేలో 66 బంతుల్లో 105 పరుగులు చేసిన స్మిత్‌ రెండో వన్డేలో మరింత దూకుడుగా ఆడాడు.

కేవలం 62 బంతుల్లోనే 100 పరుగులు సాధించిన స్మిత్‌ 104 పరుగుల వద్ద హార్దిక్‌ పాం‍డ్యా బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తొలి 50 పరుగులను 38 బంతులు తీసుకున్న స్మిత్‌ మలి 50 పరుగులను కేవలం 24 బంతుల్లోనే సాధించడం విశేషం.

ఓవరాల్‌గా వన్డేల్లో స్మిత్‌ ఇప్పటివరకు 11 సెంచరీలు చేయగా.. అందులో టీమిండియాపైనే 5 సెంచరీలు సాధించాడు. భారత్‌పై 5 కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ఆసీస్‌ ఆటగాళ్లలో రికీ పాంటింగ్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు. కాగా పాంటింగ్‌ వన్డేల్లో టీమిండియాపై ఆరు సెంచరీలు సాధించి మొదటిస్థానంలో ఉన్నాడు. అయితే పాంటింగ్‌ 6 సెంచరీలు సాధించడానికి 59 మ్యాచ్‌లు అవసరం కాగా.. స్మిత్‌ మాత్రం 20 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును సాధించడం విశేషం

Tags :

Advertisement