Advertisement

  • ఆ నిర్ణయాల వల్ల నిద్రలేని రాత్రులు గడిపా ..స్టీవ్ బక్నర్‌

ఆ నిర్ణయాల వల్ల నిద్రలేని రాత్రులు గడిపా ..స్టీవ్ బక్నర్‌

By: Sankar Sun, 21 June 2020 8:47 PM

ఆ నిర్ణయాల వల్ల నిద్రలేని రాత్రులు గడిపా ..స్టీవ్ బక్నర్‌



క్రికెట్ చరిత్రలో దిగ్గజ అంపైర్లలో స్టీవ్ బక్నర్‌ ఒకడు ..అయితే సచిన్ విషయంలో మాత్రం బక్నర్‌ అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు ఇచ్చి విమర్శలపాలు అయ్యాడు ..అందులో ఒక రెండు నిర్ణయాలు నన్ను చాల కాలం వెంటాడాయి , వాటివల్ల నిద్ర లేని రాత్రులను గడిపాను అని బక్నర్‌ అన్నాడు ..

2003 గాబా టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్‌ జాసన్‌ గిలెస్పీ వేసిన బంతికి సచిన్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే, ఆ బంతి వికెట్ల పైనుంచి చాలా ఎత్తులో వెళ్తున్నట్టు రిప్లేలో తేలింది. మరోసారి 2005 కోల్‌కతా వన్డేలో పాకిస్తాన్‌ బౌలర్‌ అబ్దుల్‌ రజాక్‌ వేసిన బంతికి సచిన్‌ను క్యాచ్‌ ఔట్‌గా ప్రకటించా. కానీ, తర్వాత తెలిసింది, అది బ్యాట్‌కు తాకనే లేదని. మనుషులన్నాక పొరపాట్లు సహజం. అయితే, వాటిని అంగీకరించాలి. ఏ అంపైర్‌ కూడా తప్పుడు నిర్ణయాలు కావాలని తీసుకోడు. ఈడెన్‌ గార్డెన్స్‌లో కిక్కిరిసిన అభిమానుల హర్షధ్వానాలే రెండో పొరపాటుకు కారణమని భావిస్తున్నా.

లక్ష మంది ఆ మ్యాచ్‌ వీక్షిస్తుండటంతో బంతి బ్యాట్‌కు తగిలింది లేనిది గ్రహించలేకపోయా. నా నిర్ణయాలకు చింతిస్తున్నా. వాటి వల్లే నా కెరీర్‌ ప్రమాదంలో పడొచ్చని అనుకుంటున్నా. పొరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు’ అని బక్నర్‌ అన్నారు. ఇక క్రికెట్‌లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, డీఆర్‌ఎస్‌ పద్ధతి పొరపాటు నిర్ణయాలు సమీక్షించుకునేందుకు చక్కని అవకాశాలు ఇచ్చాయన్నారు. అవి అంపైరింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చెప్పలేను కానీ, నిర్ణయాల్లో కచ్చితత్వం తెస్తాయని మాత్రం చెప్పగలనని బక్నర్‌ పేర్కొన్నారు.


Tags :
|
|

Advertisement