Advertisement

  • కరోనా సెకండ్ వేవ్ వస్తుంది ...తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ..ఏపీ సీఎం జగన్

కరోనా సెకండ్ వేవ్ వస్తుంది ...తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ..ఏపీ సీఎం జగన్

By: Sankar Thu, 19 Nov 2020 6:32 PM

కరోనా సెకండ్ వేవ్ వస్తుంది ...తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ..ఏపీ సీఎం జగన్


ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శీతాకాలం ప్రారంభమైన సందర్భంగా పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతాయని ఇప్పటికే వైద్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.

ఇక కరోనా కేసులు కూడా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమములో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూరప్ మొత్తం‌ కోవిడ్‌తో వణుకుతోందన్నారు. ఢిల్లీ మరో లాక్‌డౌన్‌కు రెడీ అయిందని, ఫ్రాన్స్, లండన్‌లో షట్‌డౌన్ లో ఉందని, అగ్రదేశమైన అమెరికా కూడా తీవ్ర ఇబ్బంది పడుతోందని, ప్రపంచంలోని చాలా దేశాల్లో సెకండ్ వేవ్ వస్తోందన్నారు.

అక్కడ మొదలు కాగానే, ఇక్కడా వస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి, కలెక్టర్లు శ్రద్ద తీసుకోవాలని, ప్రస్తుతానికి కోవిడ్ పాజిటవ్ కేసులు తగ్గినా, సెకండ్ వేవ్‌ వస్తుంది కాబట్టి కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

Tags :
|
|

Advertisement