Advertisement

నిర్మల్ లో అత్యాధునిక సదుపాయాలతో హాస్పిటల్...

By: chandrasekar Thu, 29 Oct 2020 1:31 PM

నిర్మల్ లో అత్యాధునిక సదుపాయాలతో హాస్పిటల్...


నిర్మల్ లో కార్పొరేట్‌ తరహాలో అత్యాధునిక సదుపాయాలతో జిల్లాలో ఆసుపత్రులు ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని శాస్త్రీనగర్‌ కాలనీలో దేవేందర్‌ రెడ్డి బుధవారం సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో మహానగరాలకు వెళ్లకుండా అన్ని సదుపాయాలతో జిల్లాలోనే హాస్పిటల్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నా రు. జిల్లా ఏర్పడక ముందు అత్యవసర సేవలకు నిజామాబాద్‌, హైదరాబాద్‌ వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు

కానీ ఇప్పుడు కార్పొరేట్‌ దవాఖానలు ఏర్పడడంతో రోగులకు సత్వర వైద్య సేవలు అందుతున్నాయన్నారు. మెరుగైన సేవలు అందించి, గుర్తింపు తెచ్చుకోవాలని సిబ్బందికి సూచించారు.

అనంతరం మంత్రి అల్లోల దంపతులను యాజమాన్యం సన్మానించింది. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ముథోల్‌ ఎమెల్యే విఠల్‌ రెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్మద ముత్యం రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, అల్లోల గౌతం రెడ్డి, తిరుపతి రెడ్డి, మురళీధర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Tags :
|
|
|

Advertisement