Advertisement

  • స్థానిక ఎన్నిలకపై ఈసీ నిమ్మగడ్డకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నివేదిక…

స్థానిక ఎన్నిలకపై ఈసీ నిమ్మగడ్డకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నివేదిక…

By: chandrasekar Thu, 29 Oct 2020 2:21 PM

స్థానిక ఎన్నిలకపై ఈసీ నిమ్మగడ్డకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నివేదిక…


ఏపి‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం కీలక నివేదిక సమర్పించింది. ఎస్‌ఈసీతో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్ని ప్రభుత్వం తరఫున నివేదిక అందజేశారు. రాష్ట్రంలో కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదన్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ కష్టమని ప్రభుత్వం నివేదికలో స్పష్టం చేసింది. ప్రతి రోజూ సుమారు 3 వేలకరోనా కేసులు నమోదవుతున్నాయని.. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదముందని తెలిపింది. అలాగే ఎన్నికల నిర్వహణకు కీలకమైన ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసుల్లో చాలా మంది కరోనా బారిన పడ్డారని ప్రభుత్వం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ దృష్టికి తీసుకెళ్లింది. దీనికి సంబంధించి ప్రభుత్వ విభాగాల వారీగా వివరాలను ఎస్‌ఈసీకి సీఎస్‌ అందజేశారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోకి రాగానే స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీని సంప్రదిస్తామని ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను గత మార్చిలో రమేశ్‌కుమార్‌ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన ఏపీలో ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యంతరమేమిటని, దీనిపై నవంబరు 2లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర హైకోర్టు కమిషనర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. అనంతరం బుధవారం సాయంత్రం సీఎస్ నీలం సాహ్ని భేటీ అయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగ సంస్థ అని, ఉత్తమ ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం నడుచుకుంటుందని చెప్పారు. సంప్రదింపు ప్రక్రియలో వచ్చిన అభిప్రాయాలను గౌరవిస్తామని రమేష్‌కుమార్‌ తెలిపారు.

Tags :
|
|

Advertisement