Advertisement

  • కార్పొరేటర్ అభ్యర్థులు 5 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు...రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి

కార్పొరేటర్ అభ్యర్థులు 5 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు...రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి

By: Sankar Fri, 06 Nov 2020 08:36 AM

కార్పొరేటర్ అభ్యర్థులు 5 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు...రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి


జీహెచ్‌ఎంసీలో కార్పొరేటర్లుగా పోటీచేసే అభ్యర్థులు రూ.5 లక్షలకు మించి ఎన్నికల వ్యయం చేయవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 2016 ఎన్నికల్లో అమలుచేసిన రిజర్వేషన్లనే ఇప్పుడూ అమలుచేయాలని సూచించారు.

రంగారెడ్డి, హైదరాబాద్‌, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల అదనపు కలెక్టర్లను డిప్యూటీ ఎలక్షన్‌ అధికారులుగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో అదనపు కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను పూర్తిచేయాలని ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో పార్థసారథి సమావేశమయ్యారు.

శనివారం ముసాయిదా ఓటర్ల జాబితా, 13న తుది ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉంటుందని అన్నారు. తుది జాబితా ప్రచురించిన నాటినుంచి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదయ్యేవరకు ఓటరుగా నమోదుచేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని అర్హులకు సూచించారు.

Tags :

Advertisement