Advertisement

  • ఆస్ట్రేలియా పర్యటనలో తన బ్యాటింగ్ విన్యాసాలను ప్రదర్శించిన బుమ్రా

ఆస్ట్రేలియా పర్యటనలో తన బ్యాటింగ్ విన్యాసాలను ప్రదర్శించిన బుమ్రా

By: Sankar Fri, 11 Dec 2020 3:10 PM

ఆస్ట్రేలియా పర్యటనలో తన బ్యాటింగ్ విన్యాసాలను ప్రదర్శించిన బుమ్రా


టీం ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ...తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బాట్స్మెన్ ను ఎన్నో సార్లు ముప్పు తిప్పలు పెట్టాడు..

అయితే తాజాగా బుమ్రా ఆస్ట్రేలియా పర్యటనలో తనలోని బాటింగ్ టాలెంట్ కూడా చూయించాడు..ఆస్ట్రేలియా గడ్డపై ఏకంగా హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా-‘ఎ’తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బుమ్రా అర్థ శతకం నమోదు చేసి ఔరా అనిపించాడు..

సదర్‌లాండ్‌ బౌలింగ్‌ లో సిక్స్‌ కొట్టి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది బుమ్రాకు తొలి ఫస్ట్‌క్లాస్‌ సెంచరీ కావడం విశేషం. బుమ్రా హాఫ్‌ సెంచరీ సాధించిన కాసేపటికి సిరాజ్‌(22) పదో వికెట్‌గా ఔట్‌ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసింది. బుమ్రా 57 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు..

Tags :
|

Advertisement