Advertisement

తండ్రి అయిన భారత స్టార్ ఆల్ రౌండర్ ..

By: Sankar Thu, 30 July 2020 6:29 PM

తండ్రి అయిన భారత స్టార్ ఆల్ రౌండర్ ..



భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తండ్రి అయ్యాడు. అతనికి కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌ గురువారం పండంటి బాబుకు జన్మనించారు. ఈ విషయాన్ని హార్దిక్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. చిన్నారి చేతిని పట్టుకుని ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. దీంతో కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, కృనాల్‌ పాండ్యా, సారా టెండూల్కర్‌, సోనాల్‌ చౌహాన్‌.. సహా పలువురు ప్రముఖులు కూడా హార్దిక్‌, నటాషా జంటకు కంగ్రాట్స్‌ తెలిపారు. మరోవైపు అభిమానులు జూనియర్‌ హార్దిక్‌ వచ్చాడంటూ కామెంట్లు పెడుతున్నారు..

హార్దిక్‌, నటాషా జోడి ఈ ఏడాది జనవరి 1న తమ నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 31న తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తమ కుటుంబంలోకి మూడో వ్యక్తి రాక కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. తమ జీవితంలో ఈ కొత్త దశ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. ఈ సమయంలో అభిమానుల ఆశీస్సులు, ప్రేమ కావాలని కోరారు.

ఇక క్రికెట్ విషయానికి వస్తే గాయం నుంచి కోలుకున్న పాండ్య టీమిండియాలోకి పునరాగమనం కోసం ఎదురు చూస్తున్నాడు ..కరోనా కి ముందు డివై పాటిల్ టోర్నీ లో సిక్సర్ల వర్షం కురిపించి ఐపీయల్ కు రెడీ అయ్యాడు ..అయితే కరోనా కారణంగా ఐపీయల్ వాయిదా పడటంతో మళ్ళీ పాండ్య కు బ్రేక్ దొరికింది..కాగా ఐపీయల్ సెప్టెంబర్ లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీయల్ లో రాణించి జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు

Tags :
|

Advertisement