Advertisement

జీఎస్టీ పరిహారంపై ప్రతిష్ఠంభన

By: chandrasekar Tue, 13 Oct 2020 10:06 AM

జీఎస్టీ పరిహారంపై ప్రతిష్ఠంభన


కరోనా వల్ల దేశ ఆర్ధిక స్థితి బాగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రాలకు వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ) పరిహారంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నాయకత్వంలో సోమవారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మూడోసారి ఈ భేటీ విఫలమైనైట్లెంది. గత వారం కూడా ఇదే అంశం ప్రధాన అజెండాగా కౌన్సిల్‌ సమావేశమైన విషయం తెలిసిందే.

వాక్సిన్ అందుబాటులోకి రాకపోవడం మరియు ఆర్ధిక మందగమనం పూర్తిగా పుంజుకోక పోవడం వల్ల అంతకుముందొకసారి కూడా జరిగిన భేటీలో ఎలాంటి నిర్ణయం లేకుండానే సమావేశం ముగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) జీఎస్టీ వసూళ్లలో క్షీణత అంచనాల మధ్య రాష్ట్రాల ఆదాయ నష్టాల భర్తీకి కేంద్రం రుణ మార్గాలను సూచించిన సంగతి విదితమే. అయితే ఇందుకు తెలంగాణ సహా ఎన్డీయేతర పాలక రాష్ట్రాలు అంగీకరించడం లేదు.

ప్రస్తుతం జీఎస్టీ పరిహారంగా రాష్ట్రాలకు కేంద్రం అప్పులు చేసి చెల్లింపులు జరుపలేదని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలపై దుష్ప్రభావాలుంటాయన్నారు. ఈ క్రమంలోనే ‘ఏకాభిప్రాయానికి రాలేకపోయాం. రాష్ట్రాలు అప్పులు చేస్తే అసలు ఇది సమస్యే కాదు’ అని జీఎస్టీ మండలి సమావేశం అనంతరం మంత్రి తెలియజేశారు.

Tags :
|
|

Advertisement