Advertisement

  • ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ అమెజాన్ లో శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు

ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ అమెజాన్ లో శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు

By: chandrasekar Thu, 05 Nov 2020 11:02 AM

ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ అమెజాన్ లో శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు


కరోనా వల్ల భక్తుల సౌకర్యార్థం ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ అమెజాన్ లో శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు. తిరుమల శ్రీవారి భక్తులకు 2021 సంవత్సరానికి సంబంధించి ముద్రించిన క్యాలెండర్లు, డైరీలను టీటీడీ తమ అఫీషియల్ వెబ్‌సైట్‌ tirupatibalaji.ap.gov.inతో పాటు ఆన్‌లైన్‌లోనూ భక్తులకు అందుబాటులో ఉంచింది. అమెజాన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా క్యాలెండర్లు, డైరీలు బుక్ చేసుకున్నవారికి ప్యాకేజింగ్, షిప్పింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది. అలాగే టీటీడీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్న విదేశాల్లోని భక్తులకు పోస్టల్ శాఖ ద్వారా టీటీడీ డెలివరీ చేసే ఏర్పాట్లు చేస్తోంది. ఇక డైరీలు, క్యాలెండర్లు కొనుగోలుకు సంబంధించిన సమాచారం కోసం 0877-2264209, 9963955585 నెంబర్లను సంప్రదించాలని టీటీడీ సూచించింది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే వారికోసం ఈ వసతులు టీటీడీ కల్పించింది. శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉంచడం కోసం విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, న్యూఢిల్లి, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాలతో పాటు టీటీడీకి అనుబంధంగా ఉన్న అన్ని ఆలయాల్లోనూ క్యాలెండర్లు, డైరీలు విక్రయానికి ఉంచింది.

Tags :

Advertisement