Advertisement

  • శ్రీశైలం హైడ్రోపవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో ఆరుకి చేరిన మృతుల సంఖ్య

శ్రీశైలం హైడ్రోపవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో ఆరుకి చేరిన మృతుల సంఖ్య

By: Sankar Fri, 21 Aug 2020 3:41 PM

శ్రీశైలం హైడ్రోపవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో ఆరుకి చేరిన మృతుల సంఖ్య


శ్రీశైలం ‌ఎడ‌మ‌ గ‌ట్టు కాలువ‌ భూగ‌ర్భ జ‌ల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. తొలుత‌ రెస్క్యూ బృందం మూడో ఫ్లోర్‌లో ఏఈ సుందర్‌ నాయక్‌ (35) మృతదేహాన్ని గుర్తించింది. ఆ త‌ర్వాత మోహ‌న్‌తో పాటు మ‌రో న‌లుగురి మృతదేహాలను గుర్తించింది.

ఏఈ సుందర్‌తో పాటు మోహ‌న్‌ మృత దేహాల‌ను బయటకు తరలించారు. గ‌ల్లంతైన‌ మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్య్కూ ఆపరేషన్‌ పూర్తయ్యేందుకు మరో అయిదు గంటల సమయం పట్టనుంది. కాగా గురువారం రాత్రి 10.35 గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు జెన్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు తెలిపారు. ప్ర‌మాద ఘ‌ట‌న గురించి సీం కేసీఆర్‌కు వివ‌రించామ‌ని పేర్కొన్నారు

కాగా చనిపోయిన ఏఈ సుందర్ నాయక్‌ది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం, జగన తండాగా తెలిసింది. అతనికి భార్య ప్రమీల ఇద్దరు కూతుళ్లు మనస్వి, నిహస్వి ఉన్నారు. నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సుందర్‌ నాయక్‌ సొంతూరుకు వచ్చి 15 రోజులు హోమ్ క్వారెంటైన్‌లో ఉండి కరోనాను జయించారు. నిన్న రాత్రి 9 గంటలకు శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విధులకు హాజరయ్యారు. అతని తండ్రి నాగేశ్వరరావు కోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు.

Tags :

Advertisement