Advertisement

  • శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు త్వరలో భక్తులకు దర్శనం

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు త్వరలో భక్తులకు దర్శనం

By: chandrasekar Mon, 01 June 2020 10:43 PM

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు త్వరలో భక్తులకు దర్శనం


శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు త్వరలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ మరోసారి పొడిగించినప్పటికీ మరిన్ని సడలింపులతో జూన్‌ 8నుంచి ఆలయ దర్శనాలకు అనుమతి ఇచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్లు ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ భక్తులందరికీ గర్భాలయ దర్శనాలు లేకుండా అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు తెలిపారు. టైం స్లాట్‌ దర్శనాలు, ఆర్జిత సేవలు మాత్రం అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు చేయనున్నట్లు తెలిపారు.

srisailala,bhramaramba,mallikarjuna swamy,ammavaru,devotees ,శ్రీశైల, భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్లు, భక్తులకు దర్శనం


పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే, చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతీ భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు.

అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.

Tags :

Advertisement