Advertisement

  • అభిమానులకు డబల్ వినోదాన్ని పంచేందుకు సిద్దమవుతున్న శ్రీను వైట్ల , మంచు విష్ణు

అభిమానులకు డబల్ వినోదాన్ని పంచేందుకు సిద్దమవుతున్న శ్రీను వైట్ల , మంచు విష్ణు

By: Sankar Mon, 23 Nov 2020 10:26 PM

అభిమానులకు డబల్ వినోదాన్ని పంచేందుకు సిద్దమవుతున్న శ్రీను వైట్ల , మంచు విష్ణు


హీరో మంచు విష్ణు, డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో పదమూడేళ్ల క్రితం వచ్చిన ‘ఢీ’ మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇదే కాంబినేషన్ సుధీర్ఘ విరామం తర్వాత మరోసారి వస్తోంది.

‘ఢీ’కి సీక్వెల్‌గా ‘డి & డి’ టైటిల్‌తో సినిమా చేయ‌డానికి వారు రెడీ అవుతున్నారు. ‘డ‌బుల్ డోస్’ అనేది ట్యాగ్‌లైన్‌. విష్ణు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోమ‌వారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించడంతో పాటు టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. టైటిల్ డిజైన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. సంకెళ్ల మ‌ధ్య రెండు ‘డి’ అక్ష‌రాల‌ను డిజైన్ చేశారు. ‘ఢీ’లో ఎంత కామెడీ, యాక్ష‌న్ ఉన్నాయో అంత‌కు రెట్టింపు కామెడీ, యాక్ష‌న్ ఈ సినిమాలో ఉంటాయ‌నే సంకేతాన్నిస్తూ ‘డ‌బుల్ డోస్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై మంచు విష్ణు స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవ‌ర‌మ్ భ‌క్త మంచు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ‘ఢీ’తో స‌హా శ్రీ‌ను వైట్ల డైరెక్ట్ చేసిన ప‌లు సినిమాల‌కు ప‌నిచేసిన ర‌చ‌యిత గోపీమోహ‌న్, మ‌రో పాపుల‌ర్ రైట‌ర్ కిషోర్ గోపు స్క్రిప్ట్ రైట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు

Tags :
|
|

Advertisement