Advertisement

  • గంగూలీ వేసిన బాటలో ధోని ముందుకెళ్లాడు ..అందుకే సక్సెస్ అయ్యాడు ..సంగక్కర

గంగూలీ వేసిన బాటలో ధోని ముందుకెళ్లాడు ..అందుకే సక్సెస్ అయ్యాడు ..సంగక్కర

By: Sankar Thu, 16 July 2020 7:22 PM

గంగూలీ వేసిన బాటలో ధోని ముందుకెళ్లాడు ..అందుకే సక్సెస్ అయ్యాడు ..సంగక్కర



సౌరవ్ గంగూలీ , మహేంద్ర సింగ్ ధోని ఇద్దరు ఇండియాకు కెప్టెన్లుగా వ్యవహరించారు ..ఇద్దరు తమ తమ టీంలను విజయపథంలో నడిపించారు ..అయితే ఈ ఇద్దరిలో గొప్ప కెప్టెన్ ఎవరు అంటే మాత్రం చెప్పడం చాలా కష్టం ..అయితే శ్రీలంక లెజెండరీ ఆటగాడు సంగక్కర మాట్లాడుతూ సౌరవ్ గంగూలీకీ ధోనీ ఎప్పటికీ పోటీకాదని అన్నాడు ..ధోనీ కేవలం జట్టును ముందుకు నడిపించాడని, అయితే అతడికి పటిష్ఠమైన జట్టును అందించింది మాత్రం గంగూలీయేనని సంగక్కర చెప్పాడు.

ధోనీ గొప్ప కెప్టెన్‌ అని, అయితే గంగూలీ వేసిన బాటలో ముందుకెళ్లడం వల్లే అతడు ఈ ఘనత సాధించగలిగాడని అన్నారు. ‘ధోనీ బ్యాట్సమన్‌, కెప్టెన్‌గా ఎంతో కష్టపడ్డాడు. ఎలప్పుడూ జట్టును గెలిపించాలనే తపన ధోనీలో కనిపిస్తుంది. కానీ గంగూలీ మాత్రం యువతను ప్రోత్సహిస్తూ, తన తరువాత వారికి ఓ మంచి జట్టును అందించేందుకు ఎంతగానో శ్రమించాడ’ని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ధోనీ చాలా అదృష్టవంతుడని, ప్రతీ ఫార్మట్లోనూ గొప్పగా రాణించగల జట్టుకు కెప్టెన్ అయ్యాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. అయితే గంగూలీ మాత్రం ఎటువంటి ప్రత్యర్థినైనా ఎదుర్కోగల బలమైన జట్టును ఏర్పరిచేందుకు చాలా కష్టపడ్డాడని గంబీర్ పేర్కొన్నాడు.

Tags :
|

Advertisement