Advertisement

  • సినిమా హాళ్లు ఓపెన్ చేయడానికి అనుమతి ..కానీ ఈ నిబంధనలు పాటించాలి

సినిమా హాళ్లు ఓపెన్ చేయడానికి అనుమతి ..కానీ ఈ నిబంధనలు పాటించాలి

By: Sankar Sun, 28 June 2020 10:22 AM

సినిమా హాళ్లు ఓపెన్ చేయడానికి అనుమతి ..కానీ ఈ నిబంధనలు పాటించాలి


కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నష్టపోయిన రంగాల్లో అతి ముఖ్యమైనది సినిమా రంగం ..ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరిగే సినిమా రంగం కరోనా కారణంగా దాదాపు నాలుగు నెలలుగా మూగబోయింది ..థియేటర్లు , సినిమా షూటింగ్లు అన్ని ఆగిపోయాయి ..అయితే ఇండియాలో ఇప్పట్లో థియేటర్లకు అనుమతి లభించే అవకాశాలు కనిపించడం లేదు కానీ శ్రీలంకలో మాత్రం థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ..

ఈ క్ర‌మంలో క‌రోనా కార‌ణంగా మార్చి నుంచి మూత‌ప‌డిన సినిమా హాళ్ల‌ను దేశ వ్యా‌ప్తంగా తిరిగి ప్రారంభిస్తున్న‌ట్లు శ్రీలంక ప్ర‌క‌టించింది. ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గ‌ద‌ర్శాల‌కు క‌ట్టుబ‌డి ఉంటే జూన్ 27 నుంచి థియేట‌ర్లు తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం స‌మాచారశాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇందుకు ప్ర‌తి థియేట‌ర్ నిర్వాహ‌కులు స్థానిక ఆరోగ్యశాఖ అధికారులకు ఒప్పంద పత్రాన్ని అంద‌జేయాల్సి ఉంటుంది.

అలాగే దేశంలో అన్ని మ్యూజియాల‌ను, స్మార‌క చిహ్నాలు, సాంస్కృతిక క‌ట్ట‌డాల సంద‌ర్శ‌న‌ను జూలై 1 నుంచి తెర‌వ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. అయితే ఇవ‌న్నీ సంద‌ర్శ‌కుల సంఖ్య‌పై ప‌రిమితులు వంటి ఆరోగ్య‌శాఖ జారీ చేసిన కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల్సి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఇదిలావుండ‌గా కఠినమైన ఆరోగ్య మార్గదర్శకాలతో విదేశీ పర్యాటకుల కోసం ఆగస్టు 1నుంచి విమాన స‌ర్వీసుల‌ను ప్రాంభిస్తున్నట్లు శ్రీలంక ప్ర‌భుత్వం తెలిపింది. కాగా శ్రీలంక‌‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,000 వేల క‌రోనా కేసులు వెలుగు చూశాయి. వీరిలో 1,200 మందికి పైగా కోలుకుని డిశ్చార్జి అవ్వ‌గా, 11 మంది మృత్యువాత ‌ప‌డ్డారు.

Tags :
|
|
|

Advertisement