Advertisement

  • హనుమంతుడి భారీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న శ్రీ హనుమత్‌ జన్మభూమి ట్రస్ట్‌

హనుమంతుడి భారీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న శ్రీ హనుమత్‌ జన్మభూమి ట్రస్ట్‌

By: Sankar Thu, 06 Aug 2020 8:37 PM

హనుమంతుడి భారీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న శ్రీ హనుమత్‌ జన్మభూమి ట్రస్ట్‌



హిందువుల పవిత్ర దైవం అయిన రాముడు యొక్క జన్మస్థలం అయిన అయోధ్య లో రామ్ మందిర్ నిర్మాణానికి భూమిపూజను ఘనంగా నిర్వహించారు ..ఇప్పుడు ఇక హనుమంతుడి వంతు వచ్చింది ..ఆంజనేయుడి జన్మస్థలమైన కర్ణాటకలోని కొప్పల్ జిల్లా హంపి సమీప కిష్కింధలో అత్యంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీ హనుమత్‌ జన్మభూమి ట్రస్ట్‌ ప్రతిపాదించింది. ఇక్కడ పవనసుతుడి విగ్రహం 215 మీటర్లు ఉండేలా చూస్తున్నారు. అంటే అయోధ్యలో ఏర్పాటుచేయబోయే రాముడి విగ్రహం (221) కంటే కేవలం ఆరు మీటర్లు తక్కువ.

ప్రపంచంలోని ఎత్తైన ఈ హనుమంతుడి విగ్రహం ఆలయ కాంప్లెక్స్‌లో ఒక భాగం. ఈ ఆలయం రామాయణం, హనుమంతుడి కథలను వివరించే కుడ్యచిత్రాలతో గోడలను కలిగి ఉంటుంది. ఈ కాంప్లెక్స్‌లో నాలుగు వైపులా భారీ గోపురాలు ఉంటాయి.

ఈ సముదాయంలో ప్రదక్షిణపాదాలు, ఉద్యానవనాలు, రాతి శిల్పాలు, అనేక ఇతర నిర్మాణ భవనాలుంటాయి. అలాగే, 60వ అంతస్తులో రాముడికి అంకితం చేసిన ఆలయం కూడా ఉంటుంది. శ్రీ రామ్ జన్భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పడిన కొద్ది రోజుల తరువాత శ్రీ హనుమత్‌ జన్మభూమి ట్రస్ట్ ఏర్పడింది. కాగా, ఈ భారీ భజరంగభళీ విగ్రహాన్ని ‘ఆధ్యాత్మిక విగ్రహం’ (స్టాచ్యూ ఆఫ్‌ డెవోషన్‌) అని పిలువనున్నారు.

Tags :
|
|

Advertisement