Advertisement

  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వార్నర్ ..ఆ ఆటగాడిపై వేటు

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వార్నర్ ..ఆ ఆటగాడిపై వేటు

By: Sankar Sun, 18 Oct 2020 3:33 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వార్నర్ ..ఆ ఆటగాడిపై వేటు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆరెంజ్‌ ఆర్మీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ .. ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకూ కేకేఆర్‌ ఎనిమిది మ్యాచ్‌లాడి నాలుగు విజయాలు సాధించగా, సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ ఎనిమిది మ్యాచ్‌లకు గాను మూడు విజయాలు మాత్రమే సాధించింది. ఓవరాల్‌గా ఇరు జట్లు 18 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా కేకేఆర్‌ 11సార్లు విజయం సాధించగా, ఎస్‌ఆర్‌హెచ్‌ 7 సార్లు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.

ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో బాసిల్‌ థంపిని జట్టులోకి తీసుకున్నారు. అబ్దుల్‌ సామద్‌ తిరిగి జట్టులో చేరాడు. మరొకవైపు కేకేఆర్‌ కూడా రెండు మార్పులు చేసింది. కుల్దీప్‌ యాదవ్‌, లూకీ ఫెర్గ్యూసన్‌లు తుదిజట్టులోకి వచ్చారు. క్రిస్‌ గ్రీన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణలకు విశ్రాంది ఇచ్చారు.

సన్ రైజర్స్ తుది జట్టు :

డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), బెయిర్‌ స్టో, మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియాంగార్గ్‌, విజయ్‌ శంకర్‌, అబ్దుల్‌ సామద్‌, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌, బాసిల్‌ థంపి

కేకేఆర్ తుది జట్టు :

ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రీ రసెల్‌, ప్యాట్‌ కమిన్స్‌, శివం మావి, కుల్దీప్‌ యాదవ్‌, ఫెర్గ్యూసన్‌, వరుణ్‌ చక్రవర్తి

Tags :
|
|
|

Advertisement