Advertisement

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డేవిడ్ వార్నర్ ..స్టార్ ఆటగాళ్ల రాకతో ఫేవరేట్ గా ధోని సేన

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డేవిడ్ వార్నర్ ..స్టార్ ఆటగాళ్ల రాకతో ఫేవరేట్ గా ధోని సేన

By: Sankar Fri, 02 Oct 2020 7:26 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డేవిడ్ వార్నర్ ..స్టార్ ఆటగాళ్ల రాకతో ఫేవరేట్ గా ధోని సేన


ఐపీయల్ 2020 లో నేడు సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపింది. ఇప్పటివరకూ ఇరుజట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడి తలో మ్యాచ్‌లు గెలిచాయి. దాంతో రెండు విజయాన్ని అందుకోవడానికి పూర్తిస్థాయిలో బరిలోకి దిగాయి. సన్‌రైజర్స్‌ ఆడిన గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి ఖాతా తెరిచింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడింది.

ఇక సీఎస్‌కే తాను ఆడిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచి శుభారంభం చేయగా, ఆ తర్వాత గెలుపును అందుకోలేకపోయింది. బ్యాటింగ్‌ విభాగంలో పటిష్టంగా లేకపోవడంతో సీఎస్‌కే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం చెందింది. దాంతో ఎలాగైనా గెలుపును అందుకోవాలనే కసితో ఉంది.

ఈ రోజు మ్యాచ్‌లో అంబటి రాయుడు తిరిగి జట్టులో చేరాడు. ఫిట్‌నెస్‌ లేని కారణంగా గత రెండు మ్యాచ్‌ల్లో ఆడని రాయుడు,..ఎస్‌ఆర్‌హెచ్‌తో తుది జట్టులోకి వచ్చాడు..ఇక స్టార్ అల్ రౌండర్ బ్రేవో కూడా చెన్నై జట్టులో చేరడంతో చెన్నై ఒక్కసారిగా పటిష్టంగా తయారు అయింది..ఇక వరుసగా విఫలం అయిన మురళి విజయ్ , ఋతురాజ్ జట్టులో స్థానం కోల్పోయారు

Tags :
|

Advertisement