Advertisement

  • సచిన్ కు దక్కిన ఆ గౌరవం ధోనికి కూడా దక్కాలి ..శ్రీశాంత్

సచిన్ కు దక్కిన ఆ గౌరవం ధోనికి కూడా దక్కాలి ..శ్రీశాంత్

By: Sankar Fri, 26 June 2020 5:56 PM

సచిన్ కు దక్కిన ఆ గౌరవం ధోనికి కూడా దక్కాలి ..శ్రీశాంత్



మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ క్రికెట్ లో సచిన్ తర్వాత ఆ స్థాయిని అందుకున్న ఆటగాడు ..సచిన్ ఆటగాడిగా మాత్రమే రాణిస్తే , ధోని మాత్రం ఆటగాడిగా , కెప్టెన్ గా ఇలా అన్ని విధాలుగా రాణించాడు ..క్రికెట్లో ఉన్న అన్ని మేజర్ టోర్నీలను తన కెప్టెన్సీలో అందుకున్నాడు ..మరి ఇన్ని ఘనతలు ఉన్న ఆటగాడు మాములుగా రిటైర్ అయితే అభిమానులను ఏ మాత్రం నచ్చదు ..అందుకే వచ్చే ఏడాది ఇండియాలో జరిగే టి ట్వంటీ ప్రపంచకప్ లో విజయం సాధించి ధోనిని బుజాల మీద ఎత్తుకొని ఘనంగా వీడ్కోలు పలికితే చూడలని ఉంది అని అన్నాడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ..

మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆడిన శ్రీశాంత్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధోనీ తప్పకుండా టీ20 వరల్డ్‌కప్‌‌లో ఆడతాడు. అంతకంటే ముందు జరిగే ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ అతను రాణిస్తాడని నా నమ్మకం. ఇప్పటి వరకూ ఎన్ని విమర్శలు వచ్చినా.. ధోనీ స్పందించలేదు. దానికి కారణం.. ఎప్పుడు ఏం చేయాలో అతని బాగా తెలుసు. 2020 టీ20 వరల్డ్‌కప్‌‌ని భారత్ గెలిచిన తర్వాత ధోనీని సహచరులు భుజాలపై ఎత్తుకుని మైదానంలో తిరుగుతుంటే చూడాలనేది నా కోరిక అని శ్రీశాంత్ వెల్లడించాడు.

అయితే గత ఏడాది జరిగిన ప్రపంచకప్ లో సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో ఓటమి పాలు అయినా తర్వాత ధోని టీంనుంచి దూరం అయ్యాడు ..ఇక ఆ తర్వాత ధోని రిటైర్మెంట్ మీద అనేక ఊహాగానాలు వచ్చినప్పటికి ధోని మాత్రం సమాధానం చెప్పకుండానే ఈ ఇయర్ ఐపీయల్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టాడు దీనితో ధోని రిటైర్మెంట్ పై ఊహాగానాలకు తెరపడింది కానీ అంతలోనే కరోనా రావడంతో అన్ని క్రికెట్ మ్యాచ్లు వాయిదా పడ్డాయి ..మరి కరోనా తర్వాత ధోని మైదానంలో దిగుతాడా లేదా అనేది ప్రస్తుతానికి సందిగ్ధంలోనే ఉంది ..

Tags :
|

Advertisement