Advertisement

  • సుశాంత్ లాగానే నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను ..శ్రీశాంత్

సుశాంత్ లాగానే నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను ..శ్రీశాంత్

By: Sankar Tue, 23 June 2020 12:40 PM

సుశాంత్ లాగానే నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను ..శ్రీశాంత్



బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యారు ..అది జరిగి వారం రోజులపైనే అవుతున్నప్పటికీ ఇంకా చాల మంది ఆ విషాదం నుంచి బయటపడలేకపోతున్నారు ..తాజాగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ మాట్లాడుతూ సుశాంత్ చనిపోయినప్పుడు ఒక్కసారిగా అతనిలో నన్ను చూసుకున్నాను అని అన్నాడు ..

నేను ఒంటరిగా నా గదిలో ఉన్నప్పుడు నిరాశ, ఒత్తిడికి లోనయ్యేవాడిని. కానీ రూం నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చేవాడిని. ఎందుకంటే నా బలహినతను, నిరాశను నా తల్లిదండ్రులు చూపించాలనుకోలేదు. ఎందుకంటే బయటి ప్రపంచానికి నేను శ్రీశాంత్‌ని కానీ నా పేరెంట్స్‌కి మాత్రం గోపుని. కానీ నా గదిలో నేను ఏంటన్నది నాకు కూడా తెలియదు. ఇది నేను 2013లో నిరంతరాయంగా పోరాడిన చీకిటి కాలం. అందుకే సుశాంత్ సింగ్ మరణ వార్త నన్ను బాగా ప్రభావితం చేసింది. తన మరణానికి కారణంలో తెలియగానే ఆ క్షణంలో సుశాంత్‌లో నన్ను చుసుకున్నాను’’ అంటు చెప్పుకొచ్చాడు.

కాగా 2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలకు పాల్పడినట్లు శ్రీశాంత్‌పై ఆరోపణలు రావడంతో అతడిని క్రికెట్‌ టీం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ‘ఒకప్పుడు నేను చీకటిని చుశానని మీకు తెలుసు. ఆ సమయంలో నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఇంటతి నుంచి అసలు బయటకు వచ్చేవాడిని కాదు. అలా ఒంటరిగా గుడపుత్ను క్రమంలో ఒకానోక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయి’ అంటూ తాను ఎదుర్కొన్నా చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా శ్రీశాంత్‌ గుర్తుచేసుకున్నాడు.

Tags :
|

Advertisement