Advertisement

  • మొదలైన పెళ్లిళ్ల సందడి ...పెళ్లిళ్లకు కరోనా నిబంధనలను పాటించాల్సిందే ..

మొదలైన పెళ్లిళ్ల సందడి ...పెళ్లిళ్లకు కరోనా నిబంధనలను పాటించాల్సిందే ..

By: Sankar Sat, 25 July 2020 1:22 PM

మొదలైన పెళ్లిళ్ల సందడి ...పెళ్లిళ్లకు కరోనా నిబంధనలను పాటించాల్సిందే ..



శ్రావణమాసంతో శుభ గడియలు, సుముహూర్తాలు మొదలయ్యాయి. ఈ మాసం హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలోని ప్రతి మంగళ, శుక్రవారాలు మహిళలకు ఎంతో ప్రీతికరమైనవి. వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు శ్రావణమాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసం రాక కోసం గృహిణులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు.

శ్రావణమాసంలో దివ్యమైన ముహూర్తాలు ఉండటంతో ముందస్తు ప్రణాళిక ప్రకారంగా గృహ ఆరంభ ముహూర్తాలు, గృహ ప్రవేశాలు, వివాహ నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు జరిపించడానికి తహతహలాడుతుంటారు. శ్రావణమాసం ముహుర్తాలు పోతే మళ్లీ కార్తీక మాసం వరకు వేచి చూడక తప్పదని కొందరు పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు.

అయితే కరోనా కారణంగా పెళ్ళికి కేవలం ఇరవై మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు ..అయితే దీనికి కూడా ముందే తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ...కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లకు తప్ప ఇతర శుభకార్యాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. పెళ్లి తంతు ఎంత వైభవమో పెళ్లి అనంతరం పెళ్లి కొడుకు ఇంటి వద్ద ఇచ్చే విందు కూడా అంతే స్థాయిలో వైభవంగా ఉంటుంది. కానీ కరోనా కారణంగా పెళ్లిళ్ల బరాత్‌లు, విందులకు అనుమతి ఇవ్వడం లేదు.

పెళ్లికి అనుమతి పొందిన వారిలో చాలా మంది నిబంధనలు ఉల్లంఘిస్తే ఎం కాదులే అనే ధీమాలో ఉన్నారు. అనుమతి పొందాక నిబంధనలు పాటిస్తున్నామా..? లేదా..? అని పరిశీలించే వ్యవస్థ లేదని, స్థానికంగా ఉండే పోలీసులను మేనేజ్‌ చేసుకోవచ్చని భావిస్తున్నారు. కాని ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.

Tags :
|
|
|
|

Advertisement